బుధవారం 12 ఆగస్టు 2020
Science-technology - Jul 13, 2020 , 14:54:12

ఎయిర్‌టెల్‌, ఐడియా ప్రీమియం ప్లాన్లను బ్లాక్‌ చేసిన ట్రాయ్‌

ఎయిర్‌టెల్‌, ఐడియా ప్రీమియం ప్లాన్లను బ్లాక్‌ చేసిన ట్రాయ్‌

న్యూఢిల్లీ : టెలికాం రెగ్యులేటరి అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) భారతీ ఎయిర్‌టెల్‌ ప్లాటినం, వొడాఫోన్‌ ఐడియా రెడ్‌ఎక్స్‌ ప్రీమియం ప్లాన్లను బాక్ల్‌ చేసింది. ఈ రెండు ప్రణాళికలు నెట్‌ న్యూట్రాలిటీ నిబంధనలను ఉల్లంగిస్తున్నాయని పేర్కొంది. నిబంధలు ఉల్లంఘించకుండా ఇలాంటి ప్లాన్‌లను ఎలా అమలు చేయాలో ఏడు రోజుల్లో వివరించాలని భారతీ ఎయిర్‌టెల్‌ను కోరింది. వొడాఫోన్ ఐడియా రెడ్ ఎక్స్ ప్లాన్ 2019 నవంబర్ నుంచి మార్కెట్లో అమలులో ఉంది. మే, 2020లో కొన్ని మార్పులు చేశారు. ఎయిర్‌ టెల్ త్వరలోఇదే విధమైన ప్లాన్‌ను ప్రారంభించబోతున్నది.

ఈ ప్లాన్లలో ప్రీమియం కస్టమర్లకు అధిక వేగం, ప్రాధాన్యత సేవలు ఇస్తుండడం నెట్‌ న్యూట్రాలిటీకి విరుద్ధం. దీనిపై ఎయిర్‌ టెల్‌ ప్రతినిధి మాట్లాడుతూ ‘మా ఖాతాదారులందరికీ అత్యుత్తమ నెట్‌వర్క్‌, సర్వీసు అనుభవాన్ని అందించడానికి మక్కువతో ఉన్నాం. అందుకే లోపాలను తొలగించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం. అదే సమయంలో, మా పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం సేవలు, ప్రతిస్పందన విషయంలో బార్‌ను పెంచాలని కోరుకుంటున్నామని, ఇది మా చివర్లో కొనసాగుతున్న ప్రయత్నం’ అని చెప్పారు. 


logo