శుక్రవారం 22 జనవరి 2021
Science-technology - Jan 12, 2021 , 13:29:11

వాట్సాప్ మెసేజ్‌లు, అకౌంట్ ఇలా డిలీట్ చేయండి

వాట్సాప్ మెసేజ్‌లు, అకౌంట్ ఇలా డిలీట్ చేయండి

వాట్సాప్ కొత్త ప్రైవ‌సీ పాల‌సీపై చాలా మంది యూజ‌ర్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ డేటా అంతా తీసుకెళ్లి త‌న మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇవ్వ‌నున్న‌ట్లు అందులో స్ప‌ష్టంగా పేర్కొన‌డంపై కోట్లాది మంది యూజ‌ర్లు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో చాలా మంది వాట్సాప్ వ‌దిలి సిగ్న‌ల్‌, టెలిగ్రామ్ వంటి ఇత‌ర యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. అయితే మీరు కూడా వాట్సాప్ అకౌంట్‌ను డిలీట్ చేయాల‌ని అనుకుంటే.. ముందుగా స‌ర్వ‌ర్ల‌లోని మెసేజ్‌ల‌న్నీ డిలీట్ చేయండి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. 

బ్యాక‌ప్ మెసేజ్‌ల‌ను ఎలా డిలీట్ చేయాలి?

వాట్సాప్ బ్యాక‌ప్ మెసేజ్‌ల‌ను డిలీట్ చేయ‌వ‌చ్చు. మీ చాట్ హిస్ట‌రీకి సంబంధించిన బ్యాక‌ప్ ఫైల్స్ /sdcard/WhatsApp/Databases/folderలో సేవ్ అవుతాయ‌ని వాట్సాప్ చెబుతోంది. ఈ ఫైల్స్‌ను ఫైల్ మేనేజ‌ర్ ద్వారా డిలీట్ చేయ‌వ‌చ్చు. దీనికోసం ఈ కింది స్టెప్స్‌ను అనుస‌రించండి.

- ఫైల్ మేనేజ‌ర్ ఓపెన్ చేయండి

- అందులో వాట్సాప్ ఫోల్డ‌ర్‌పై నొక్కండి

- అక్క‌డ వాట్సాప్ స‌బ్ ఫోల్డ‌ర్ల‌న్నీ క‌నిపిస్తాయి

- డేటాబేసెస్ ఫైల్‌పై నొక్కిప‌ట్టి ఉంచండి

- త‌ర్వాత డిలీట్ ఆప్ష‌న్ ఎంచుకోండి

వాట్సాప్ అకౌంట్ ఎలా డిలీట్ చేయాలి?

వాట్సాప్ అకౌంట్‌ను డిలీట్ చేయాల‌నుకుంటే యాప్‌లోకే వెళ్లి చేయాల్సి ఉంటుంది. అయితే ఒక‌సారి మీ అకౌంట్ డిలీట్ చేస్తే దానిని తిరిగి పొంద‌లేర‌ని వాట్సాప్ స్ప‌ష్టంగా చెబుతోంది. 

- సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్ ఎంపిక చేసుకొని డిలీట్ మై అకౌంట్‌పై నొక్కండి.

మీ మొబైల్ నంబ‌ర్‌ను పూర్తి ఇంట‌ర్నేష‌న‌ల్ ఫార్మాట్‌లో ఎంట‌ర్ చేసి డిలీట్ మై అకౌంట్‌పై నొక్కాలి.

ఆ త‌ర్వాత అకౌంట్ డిలీట్ చేయ‌డానికి కార‌ణాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. మీ వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేస్తే అది మీ మెసేజ్ హిస్ట‌రీని డిలీట్ చేయ‌డంతోపాటు అన్ని గ్రూపుల నుంచి మిమ్మ‌ల్ని తొల‌గిస్తుంది. గూగుల్ డ్రైవ్ బ్యాక‌ప్ కూడా డిలీట్ అవుతుంది. 


ఇవి కూడా చ‌ద‌వండి

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో మూడ్ ఇదీ.. వీడియో

ప్రైవ‌సీ పాల‌సీపై క్లారిటీ ఇచ్చిన వాట్సాప్‌

క్ష‌మాప‌ణ‌లు కోరిన ఆస్ట్రేలియా కెప్టెన్ పేన్‌logo