బుధవారం 30 సెప్టెంబర్ 2020
Science-technology - Sep 15, 2020 , 16:48:36

ప్రపంచంలోనే అత్యంత స్పష్టమైన ఫొటో.. 3,200 మెగాపిక్సెల్‌తో తీశారు..!

ప్రపంచంలోనే అత్యంత స్పష్టమైన ఫొటో.. 3,200 మెగాపిక్సెల్‌తో తీశారు..!

వాషింగ్టన్‌: కెమెరాలు మనచేతికొచ్చినప్పుడు ఒక మెగాపిక్సెల్‌తో ఫొటోలను బంధించేవి. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. ఫోన్‌లు 10-12 మెగాపిక్సెల్ కెమెరాలతో వస్తున్నాయి. దీంతో ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ ఫొటోలు తీసేస్తున్నాం. అయినా మెగా పిక్సెల్‌పై వ్యామోహం తగ్గలేదు. ఫలితంగా వివిధ కంపెనీలు 50-100 మెగాపిక్సెల్‌లతో  ఫోన్‌, కెమెరాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే, మీరు ఎప్పుడైనా 3,200 మెగాపిక్సెల్‌తో ఒక ఫొటో తీస్తే ఎలా ఉంటుందో ఊహించారా? దీన్ని మన కళ్లముందుకు తీసుకొచ్చారు అమెరికాలోని ఇంధన శాఖ ఎస్‌ఎల్‌ఏసీ నేషనల్ యాక్సిలరేటర్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు. 


ప్రపంచంలోనే మొట్టమొదటి 3,200 మెగాపిక్సెల్ ఫోటోలను విడుదల చేశారు. ఇది రోమనెస్కో బ్రకోలీ కూరగాయ ఫొటో. ప్రపంచంలోని అతిపెద్ద డిజిటల్ కెమెరా ప్రధాన కేంద్రంగా మారే ఇమేజ్ సెన్సార్ శ్రేణిని ఉపయోగించి చిత్రాలు తీశారు. అదే సాంకేతిక పరిజ్ఞానం ఉన్న కెమెరా ప్రస్తుతం ఎస్‌ఎల్‌ఏసీ ప్రయోగశాలలో అభివృద్ధి చేస్తున్నారు. కెమెరా నిర్మాణం పూర్తయిన తర్వాత, చిలీలో ఉన్న లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ (ఎల్‌ఎస్‌టీ) టెలిస్కోప్‌లో దీనిని మొదట ఉపయోగించుకునే అవకాశం ఉంది.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo