మంగళవారం 27 అక్టోబర్ 2020
Science-technology - Aug 16, 2020 , 22:01:36

టెలిగ్రామ్ నుంచి సరికొత్త ఫీచర్

  టెలిగ్రామ్ నుంచి సరికొత్త ఫీచర్

ముంబై : ప్రముఖ మెస్సేజింగ్ యాప్ 'టెలిగ్రామ్'  సరికొత్త  ఫీచర్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెలిగ్రామ్ బీటా వర్షన్‌లో అందుబాటులో ఉండగా... త్వరలోనే 7.0 వర్షన్‌లోనూ తీసుకొస్తామని టెలిగ్రామ్ వెల్లడించింది. కాల్ మధ్యలో వీడియోను స్విచ్ ఆన్, స్విచాఫ్ చేసే సదుపాయాన్ని కూడా టెలిగ్రామ్ అందించనుంది. వీడియో కాల్స్‌లో పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్‌ను కూడా తీసుకొచ్చారు. తద్వారా వీడియో కాల్ మాట్లాడుతూనే ఇతర ఆప్షన్స్‌ను యూజ్ చేసుకోవచ్చు. ఆడియో కాల్స్ విషయంలో వినియోగదారులకు వ్యక్తిగత భద్రత ఉంటుంది. ఆడియో కాల్స్ మాదిరే అన్ని వీడియో కాల్స్‌ను ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేసినట్లు టెలిగ్రామ్ తెలిపింది


logo