బుధవారం 05 ఆగస్టు 2020
Science-technology - Aug 01, 2020 , 15:27:55

ఫేస్‌బుక్ నుంచి సరికొత్త ఫీచర్

 ఫేస్‌బుక్ నుంచి సరికొత్త ఫీచర్

ఢిల్లీ : ఫేస్‌బుక్ తమ వినియోగదారులకు సరికొత్త ఫీచర్ ను అందించేందుకు సిద్ధమైంది. ఇకపై అధికారిక మ్యూజిక్ వీడియో లను  ఫేస్‌బుక్ లో అందించనుంది. ఈ సేవలను అమెరికా సహా ఇండియా లో కూడా   ఫేస్‌బుక్  ప్రారంభించింది. ఇందుకోసం టీ-సిరీస్, జీ మ్యూజిక్, యష్ రాజ్ ఫిలిమ్స్ వంటి కంపెనీలు  ఫేస్‌బుక్ తో కలిసి పనిచేయనున్నాయి. దీంతో   ఫేస్‌బుక్ యూజర్ల కు సరికొత్త అనుభూతి లభించను న్నది. ఏడాది కాలంగా ఇలాంటి సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని, మొత్తానికి ఇప్పుడు సాధ్యమయిందని ఫేస్ బుక్ ఇండియా డైరెక్టర్, హెడ్ ఆఫ్ పార్టనర్ షిప్స్ మనీష్ చోప్రా వెల్లడించారు.

ఫేస్ బుక్ ప్లాట్ ఫామ్ పై సరికొత్త మ్యూజిక్ వీడియో ఎక్స్ పీరియన్స్ ను మా వినియోగదారులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.ఫేస్ బుక్ అందిస్తున్న సరికొత్త మ్యూజిక్ వీడియోలు కేవలం పాటలే కాకుండా ఆర్టిస్టులు, వారికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలు కూడా వినియోగదారులు తెలుసుకునే అవకాశం కల్పిస్తారు. అది కూడా  ఫేస్‌బుక్ పేజీ నుంచి బయటకు వెళ్లకుండానే సమస్త సమాచారం అక్కడ లభిస్తుంది. దీనిని సోషల్ షేరింగ్ ద్వారా మిత్రులతో పంచుకోవచ్చు. న్యూస్ ఫీడ్ లో భాగంగా వీక్షించవచ్చు. ఫేస్ బుక్ వాచ్ అనే సరికొత్త ఆప్షన్ ద్వారా కూడా అధికారిక మ్యూజిక్ వీడియో లు వీక్షించేందుకు అవకాశం లభిస్తుంది.logo