శనివారం 05 డిసెంబర్ 2020
Science-technology - Sep 11, 2020 , 06:56:27

పారాసిటమాల్‌తో మానసిక సమస్యలు

పారాసిటమాల్‌తో మానసిక సమస్యలు

వాషింగ్టన్‌ : జ్వరం, నొప్పి నివారణకు సాధారణంగా వాడే ఎసిటమినోఫెన్‌ (పారాసిటమాల్‌ అని కూడా పిలుస్తారు) మాత్రలతో మానసికంగా కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని అమెరికా పరిశోధకులు తెలిపారు. ఈ మాత్రలను తీసుకున్న వారి మానసిక స్థితిలో కొన్ని మార్పులను గుర్తించినట్టు వెల్లడించారు. అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రతిస్పందించే శక్తి వీళ్లలో కొంతమేర తగ్గుతున్నదన్నారు. భావోద్వేగాలు, ఇతరుల పట్ల సానుభూతి వంటివి కూడా క్షీణిస్తున్నట్టు గుర్తించామని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.