శుక్రవారం 07 ఆగస్టు 2020
Science-technology - Jul 10, 2020 , 20:15:29

డేటా అవినీతి నివారణకు సరికొత్త టెక్నాలజీ : మైక్రోసాఫ్ట్‌

డేటా అవినీతి నివారణకు సరికొత్త  టెక్నాలజీ :  మైక్రోసాఫ్ట్‌

సిస్టమ్‌ భద్రతా విధానాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి , విండోస్‌ 10 టూల్స్‌లో డేటా నిర్మాణాలను దెబ్బతీసేందుకు సైబర్‌ నేరస్థుల అవినీతి అక్రమ పద్ధతులను నివారించుటకు మైక్రోసాప్ట్‌ కొత్త ప్లాట్‌ఫాం భద్రతా సాంకేతికతను ప్రవేశపెట్టింది. కెర్నల్‌ డేటా ప్రొటెక్షన్‌ (కేడీపీ) టెక్నాలజీ విండోస్‌ కెర్నల్‌, డ్రైవర్లను వర్చువలైజషన్‌-బేస్డ్‌ సెక్యూరిటీ (వీబీఎస్‌)తో రక్షించడం ద్వారా డేటా సైబర్‌ దాడులను నిరోధిస్తుంది.

సంస్థ తెలిపిన వివరాల  ప్రకారం .. కేడీపీ అనేది ఏపీఐల సమితి (అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌లు), ఇది కొన్ని కెర్నల్‌ మెమరీకి రీడ్‌ ఓన్లీ ఆప్షన్‌ మాత్రమే ఉండేలా చేస్తుంది. దాడి చేసేవారు రక్షిత మెమరీని ఎప్పుడు సవరించకుండా నిరోధిస్తుంది.  ‘విధాన డేటా  నిర్మాణాలపై దాడి చేయడానికి, హానికరమైన, సంతకం చేయని డ్రైవర్‌ను ఇన్‌స్టాల్‌ చేయడానికి దాడి చేసేవారు సంతకం చేసిన కానీ, హాని కలిగించే డ్రైవర్లను ఉపయోగించడాన్ని  గమనించాము. పాలసీ డేటా నిర్మాణాలను దెబ్బతీయకుండా కేడీపీ నివారిస్తుందని’ అని టెక్‌ దిగ్గజం ఒక ప్రకటనలో తెలిపింది. 

విండోస్‌ కెర్నల్‌, ఇన్‌బాక్స్‌ భాగాలు, భద్రతా ఉత్పత్తులు, యాంటీ-చీట్‌, డిజిటల్‌ హక్కుల నిర్వహణ (డీఆర్‌ఎం) సాఫ్ట్‌వేర్‌ వంటి థర్డ్‌ పార్టీ డ్రైవర్లకు కూడా కెర్నల్‌ మెమరీని చదవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. సురక్షితమైన కోర్‌-పీసీల్లో డిఫాల్ట్‌గా మద్దతిచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని కేడీపీ ఉపయోగిస్తుంది. ఇది ఓఎస్‌ను బలపరిచే సాంకేతికతలకు ప్రత్యేకం, నమ్మకమైన ఉత్తమ భద్రతను అందించే నిర్దిష్ట    పరికరాలను పొందుపరుస్తుంది.   ‘ఇది సున్నితమైన సిస్టమ్‌ కాన్ఫిగరేషన్‌ డేటా కోసం రక్షణ అందించే మరొక పొరను జోడించడం ద్వారా సెక్యూర్డ్‌ - కోర్‌ పీసీలను తయారు చేసే లక్షణాలతో మరింత భద్రతను ఇస్తుంది.  

 


logo