ఆదివారం 25 అక్టోబర్ 2020
Science-technology - Sep 23, 2020 , 18:04:09

విండోస్10 ఆపరేటింగ్ సిస్టం లో సరికొత్త మార్పులు....

విండోస్10 ఆపరేటింగ్ సిస్టం లో సరికొత్త మార్పులు....

బెంగళూరు :మైక్రోసాఫ్ట్ సంస్థ సంవత్సరానికి రెండు కీలకమైన అప్డేట్ విడుదల చేస్తుంటుంది. అందులోభాగంగానే డెస్క్ టా ప్‌లో గానీ, లాప్టాప్ లో గానీ విండోస్10 ఆపరేటింగ్ సిస్టం లో సరికొత్త మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నది. అయితే తాజాగా అక్టోబర్ 2020 అప్డేట్ విడుదల చేసింది. ప్రస్తుతం విండోస్ ఇన్ సైడర్స్ కోసం లభిస్తున్నఈ అప్ డేట్ అతి త్వరలో విండోస్ 10 వినియోగదారులకు అందనున్నది. అన్నిటికంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది గతంలో ఎప్పుడూ లేని విధంగా విండోస్ టెన్  2020 అక్టోబర్ అప్డేట్ చాలా వేగంగా ఇన్స్టాల్ అవుతుంది. ఎంత వేగం అంటే కేవలం ఒకే ఒక నిమిషంలో ఈ అప్డేట్ ఇన్స్టాల్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ ఈ విషయంలో చాలా శ్రమించినట్లు అర్థమవుతోంది. ఇప్పటివరకు విండోస్-10 స్టార్ట్ మెనూ చూపించిన దానికి భిన్నంగా మరింత లైట్ వెయిట్ గా ఇందులో స్టార్ట్ మెనూ కనిపిస్తుంది. అలాగే ఆకర్షణీయమైన సరికొత్తగా ఐకాన్ లు కూడా దర్శనమిస్తాయి. ఫ్లూయెంట్ డిజైన్ ఆధారంగా వీటిని రూపొందించారు.

Google Chrome బ్రౌజర్‌కి ఈ మధ్యకాలంలో మైక్రోసాఫ్ట్ Edge గట్టి పోటీ ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో కూడా అనేక కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. మునుపటి కంటే మరింత వేగంగా ఇది పనిచేస్తుంది. వివిధ అప్లికేషన్ ఓపెన్ చేసి మీ కంప్యూటర్ లో వచ్చే అనేక రకాల నోటిఫికేషన్స్‌ని సులభంగా అర్థం చేసుకోవడానికి అదనంగా మరికొన్ని ఆప్షన్స్ అందించారు. Alt+Tab ద్వారా ఇప్పటికే ఓపెన్ చేసి  ఉన్న వివిధ రకాల అప్లికేషన్స్ చూసేటప్పుడు గతంలో కంటే మరింత మెరుగైన సదుపాయాలు దీంట్లో అందించారు. మైక్రోసాఫ్ట్ Edge బ్రౌజర్ విషయంలో ఇటీవలే ఓపెన్ చేసిన పలురకాల వెబ్సైట్లు కూడా ఇందులో ప్రత్యేకమైన టాబ్‌లుగా కనిపిస్తుంటాయి. అనేక చిన్న ,పెద్ద కీలకమైన మార్పులు Windows 10 అక్టోబర్ 2020 అప్డేట్ లో అందుబాటులోకి వచ్చాయి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo