మంగళవారం 01 డిసెంబర్ 2020
Science-technology - Aug 15, 2020 , 13:26:06

అతి తక్కువ ధరకే ఎలక్ట్రికల్ స్కూటర్... చుస్తే షాక్ అవ్వాల్సిందే!

అతి తక్కువ ధరకే ఎలక్ట్రికల్ స్కూటర్... చుస్తే షాక్ అవ్వాల్సిందే!

ఢిల్లీ : భారత మార్కెట్ లో మరో కొత్త ఎలక్ట్రికల్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. "డిటెల్ ఈజీ" పేరుతో విపణిలోకి ప్రవేశపెట్టారు. ఎలక్ట్రికల్ పరికరాల తయారీ సంస్థ డిటెల్ ఈజీ ఎలక్ట్రికల్ స్కూటర్ ధర జీఎస్టీతో కలుపుకుని కేవలం రూ.19,999కే అందించనున్నారు. డిటెల్ ఈజీ స్కూటర్ ను సంస్థ ప్రధానంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ, ప్లీట్ ఆపరేటర్లను దృష్టిలో పెట్టుకుని స్కూటర్ ను రూపొందించింది. ప్రస్తుతం భారత దేశ మార్కెట్ లో లభిస్తున్న ఈ -స్కూటర్లలో అత్యంత తక్కువ ధరకు లభిస్తున్న ఏకైక స్కూటర్లలో డిటెల్ ఈజీ నిలుస్తుందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.

జెట్ బ్లాక్, పెరల్ వైట్, మెటాలిక్ రెడ్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో ఉన్నాయి. డిటెల్ ఈజీ స్కూటర్ కు సంబంధించిన వివరాలు, ఆన్ లైన్ బుకింగ్ సంబంధించి detel-india.com వెబ్ సైట్ ద్వారా స్కూటర్ వివరాలు తెలుసుకొని ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకోవచ్చు. డిటెల్ ఈజీ కొనుగోలుకు సంబంధించి యాజమాన్యం సులభతరం చేయనుంది. వినియోగదారులు వాహనాన్ని ఈఎంఐ సదుపాయం ద్వారా కూడా స్కూటర్ ను కొనుగోలు చేసుకోవచ్చు. దీని కోసం డిటెల్ సంస్థ బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్ తో ఒప్పందం కుదర్చుకుంది.

బజాజ్ ఫైనాన్స్ తో చేతులు కలపడంతో ఇప్పుడు సరసమైన ధరతోనే డిటెల్ ఈజీ స్కూటర్ ను వినియోగదారులు తమ స్వంతం చేసుకోవచ్చు. స్కూటర్ కు సంబంధించి దీని ముందుభాగంలో ఒక బాస్కెట్, పెరిగిన రైడర్ సీట్, ప్లాట్ పిలియన్ సీట్, బ్యాక్ రెస్ట్ కూడా అందుబాటులో ఉంచారు. ఇందులో ప్రత్యేకంగా బరువును మోయడానికి యుటిటేరియన్ డిజైన్ ను కలిగిన ఫీచర్ ను పొందుపర్చారు. ప్లీట్ ఆపరేటర్లు, డెలివరీ ఎగ్జిక్యూటివ్ లకు సరిపోయేలా దీని వెనుక ప్లాట్ సీటు, ఫ్రంట్ బాస్కెట్ లను డిజైన్ చేశారు.