శనివారం 28 నవంబర్ 2020
Science-technology - Oct 24, 2020 , 17:12:57

టోసిలిజుమాబ్‌..కొవిడ్‌ చికిత్సకు పనికిరాదు..!

టోసిలిజుమాబ్‌..కొవిడ్‌ చికిత్సకు పనికిరాదు..!

న్యూఢిల్లీ: కొవిడ్‌-19ను ఎదుర్కొనే టీకా ఇంకా రాలేదు. తక్కువ సంఖ్యలో కేసులు వస్తున్నా..ముప్పు ఇంకా పోలేదు. అందుకే దీని చికిత్సకోసం పరిశోధకులు అన్ని రకాల డ్రగ్స్‌ను పరీక్షిస్తున్నారు. మలేరియా,హెచ్‌ఐవీలాంటి ఇతర ఇన్ఫెక్షన్లకు వాడే మందులను పరిశీలించారు. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ చికిత్సలో వాడే టోసిలిజుమాబ్‌నూ టెస్ట్‌ చేసిన పరిశోధకులు అది కొవిడ్‌ను తగ్గించేందుకు పనికిరాదని తాజాగా తేల్చారు.  

కొవిడ్‌-19 చికిత్సలో టోసిలిజుమాబ్‌ ప్రభావవంతంగా పనిచేస్తుందని మొదట పరిశోధకులు భావించారు. ఇంటర్‌లూకిన్ 6 అనే ప్రోటీన్ చర్యను అడ్డుకుంటుందని, ఇది రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనకు దోహదం చేస్తుందని భావించారు. అలాగే, ఇది కొవిడ్‌ మరణాల సంఖ్యను తగ్గిస్తుందని అనుకున్నారు. దీనిపై నాలుగు క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించారు. ఇది మరణాల సంఖ్యను తగ్గించడం లేదని తేల్చారు. ఈ వివరాలను  పరిశోధకులు అక్టోబర్ 21న న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించారు.