బుధవారం 27 జనవరి 2021
Science-technology - Jan 13, 2021 , 20:02:34

దూసుకెళ్తోన్న టెలిగ్రామ్‌...రికార్డు స్థాయిలో డౌన్‌లోడ్లు

దూసుకెళ్తోన్న టెలిగ్రామ్‌...రికార్డు స్థాయిలో డౌన్‌లోడ్లు

న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్‌ టెలిగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ల మంది యూజర్ల మార్కును దాటింది. ఫేస్‌బుక్‌కు చెందిన మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ నూతన ప్రైవసీ పాలసీ అప్‌డేట్‌ తీసుకురావడంతో భారత్‌లో టెలిగ్రామ్‌తో పాటు సిగ్నల్‌ యాప్‌ డౌన్‌లోడ్లు భారీగా పెరిగాయి.  కొన్ని రోజుల్లోనే టెలిగ్రామ్‌ కొత్తగా 25 మిలియన్ల మంది వినియోగదారులను సంపాదించుకుంది.   

భారత్‌లో వినియోగదారుల సంఖ్యను టెలిగ్రామ్‌ వెల్లడించకపోయినప్పటికీ, కొత్త వినియోగదారులలో 38% ఆసియాకు చెందినవారేనని పేర్కొంది.  తర్వాత యూరప్ (27%), లాటిన్ అమెరికా (21%),  మెనా (మిడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా 8%)లలో కొత్తగా డౌన్‌లోడ్లు పెరిగాయని చెప్పింది.  

జనవరి మొదటి వారంలో 500 మిలియన్ల  మంత్లీ యాక్టివ్‌ యూజర్లను అధిగమించామని టెలిగ్రామ్‌ తెలిపింది.  గత 72 గంటల్లోనే 25 మిలియన్ల మంది కొత్త వినియోగదారులు టెలిగ్రామ్‌లో చేరారని, యాప్‌ను వినియోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉందని టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ చెప్పారు.  

సెన్సార్ టవర్ డేటా ప్రకారం భారత్‌లో  జనవరి 6-10 మధ్య 1.5 మిలియన్ల మంది కొత్తగా టెలిగ్రామ్‌ను  డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.  అదే సమయంలో  వాట్సాప్‌ను  కేవలం 1.3 మిలియన్ల మంది మాత్రమే   కొత్తగా డౌన్‌లోడ్స్‌ చేసుకున్నారు. జనవరి 6 నుంచి 10  మధ్య సిగ్నల్‌, టెలిగ్రామ్‌ యాప్‌లకు ఏకంగా 4 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్లు పెరిగాయి.  


logo