బుధవారం 27 జనవరి 2021
Science-technology - Jan 13, 2021 , 18:00:29

కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసిన టెక్నో

కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసిన టెక్నో

న్యూఢిల్లీ: ట్రాన్సిషన్‌ హోల్డింగ్స్‌కు చెందిన గ్లోబల్‌  ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ టెక్నో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో ఆవిష్కరించింది.  టెక్నో కామన్ 16 ప్రీమియర్ డ్యూయల్ సెల్ఫీ కెమెరా సెటప్‌తో వస్తున్నది.  48 మెగా పిక్సెల్‌  సెల్పీ కెమెరా ఉండటం విశేషం.   4,500 ఎంఏహెచ్ బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రూపొందించారు. 6.9-అంగుళాల ఫుల్‌ హెచ్‌డి + డిస్‌ప్లే,  సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

జనవరి 16న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఫోన్‌ విక్రయాలు ప్రారంభమవుతాయి. భారత్‌లో ఫోన్‌ రూ.16,999గా నిర్ణయించారు.  దేశంలోని ఆఫ్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్లలో కూడా అందుబాటులో ఉంటుంది. 

టెక్నో కామన్‌ 16 ప్రీమియర్‌ స్పెసిఫికేషన్లు 

డిస్‌ప్లే:6.90అంగుళాలు

ఫ్రంట్‌ కెమెరా:48+8 మెగా పిక్సల్‌

రియర్‌ కెమెరా:64+8+2+2 మెగా పిక్సల్‌

ర్యామ్‌:8జీబీ

స్టోరేజ్‌:128జీబీ

బ్యాటరీ కెపాసిటీ:4500mAh

ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 10


logo