గురువారం 25 ఫిబ్రవరి 2021
Science-technology - Jan 19, 2021 , 23:59:26

టెక్కీలకు శుభవార్త: ఫ్రెషర్లకు కొలువులు పుష్కలం

టెక్కీలకు శుభవార్త: ఫ్రెషర్లకు కొలువులు పుష్కలం

న్యూఢిల్లీ: ప‌్ర‌స్తుతం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ సాగుతున్న నేప‌థ్యంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం త‌గ్గిన వెంట‌నే వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రంలో ప్రెష‌ర్ల‌కు ఉద్యోగావ‌కాశాలు స్వాగ‌తం పలుక‌నున్నాయి. టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్‌, విప్రో సంస్థ‌లు వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రంలో ఇంజినీరింగ్ కాలేజీల్లో.. క్యాంప‌స్ సెల‌క్ష‌న్స్ ద్వారా ర‌‌మార‌మీ ల‌క్ష మంది (91 వేల మంది) ఫ్రెషర్ల‌ను ఉద్యోగాల్లో నియామ‌కానికి ప్ర‌ణాళిక‌లు రూపొందించుకున్నాయి. 

టీసీఎస్ ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ అండ్ గ్లోబ‌ల్ హెచ్ార్ హెడ్ మిలింద్ ల‌క్కాడ్ ఇటీవ‌ల మీడియాతో మాట్లాడుతూ వ‌చ్చే ఏడాది క్యాంప‌స్ నియామ‌కాల సంగ‌తి వెల్ల‌డించారు. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో 40 వేల మందిని నియ‌మించుకున్నామ‌ని, వ‌చ్చే ఏడాది కూడా అంతే మంది ప్రెష‌ర్ల‌ను నియ‌మించుకుంటామ‌ని తెలిపారు. ఇక ఇన్ఫీ సైతం వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రంలో 24 వేల మంది నియామ‌కానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసింది. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో 15 వేల మందిని నియ‌మించుకున్న‌ది.  

ఇక హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్ హెచ్ఆర్ విభాగం చీఫ్ ఆఫీస‌ర్ వీవీ అప్పారావు మాట్లాడుతూ ఫ్రెష‌ర్ల నియామ‌కాలు వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రంలో ఊపందుకోనున్నాయ‌ని చెప్పారు. మూడో, నాలుగో త్రైమాసికాల్లో నిర్దేశిత ల‌క్ష్యాల కంటే 33 శాతం ఎక్కువ‌గా ప‌ని చేయాల్సి వ‌స్తున్న‌ద‌న్నారు.  గ‌తేడాది భార‌త‌దేశంలో 70 శాతం మ్యాన్ ప‌వ‌ర్, విదేశాల్లో 30 శాతం పెరిగింద‌ని చెప్పారు. ఈ ఏడాది అది భార‌త్‌లో 90 శాతం, విదేశాల్లో 10 శాతంగా ఉంద‌న్నారు. హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్ భార‌త్‌లో 15 వేలు, 1500-2000 మందిని ఆన్‌సైట్ నియామ‌కాలు చేప‌ట్టాల‌ని ప్ర‌ణాళిక వేసుకున్న‌ది. 

విప్రో సైతం కొన్ని నెల‌ల్లో ప్ర‌తిభావంతుల నియామ‌కానికి సిద్ధ‌మ‌వుతున్న‌ది. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో గ‌త రెండు త్రైమాసికాల్లో ఐటీ సంస్థ‌ల్లో నియామ‌కాలు వేగ‌వంతం అయ్యాయి. గ‌త కొన్ని నెల‌లుగా అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లే ఎక్కువ‌గా నియామ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని విప్రో హెచ్ఆర్ చీఫ్ ఆఫీస‌ర్ సుర‌భ్ గోవిల్ చెప్పారు. ఇన్ఫోసిస్ దేశ చ‌రిత్ర‌లో తొలిసారి జ‌ర్మ‌న్ ఆటోమోటివ్ మేజ‌ర్ డాల్మియ‌ర్‌తో 3.2 బిలియ‌న్ల డాల‌ర్ల డీల్ ఒప్పందం కుదుర్చుకున్న‌ది. ఫ్రూడెన్షియ‌ల్ ఫైనాన్సియ‌ల్ తో డీల్ టీసీఎస్‌, జ‌ర్మ‌నీ రిటైల‌ర్ మెట్రోతో విప్రో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo