శనివారం 23 జనవరి 2021
Science-technology - Nov 29, 2020 , 18:38:39

ఫ్లిప్‌కార్ట్ లో సూపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే మోటోరోలా ఫోన్లు...

ఫ్లిప్‌కార్ట్ లో సూపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే మోటోరోలా ఫోన్లు...

ముంబై : మోటోరోలా కంపెనీ ఇటీవ‌ల విడుద‌ల చేసిన స్మార్ట్ ఫోన్లలో ఎక్కువ‌గా పాపుల‌ర్ అయిన మోడల్స్ మోటో జీ 9, మోటో ఫ్యూజ‌న్ ప్లస్‌. అయితే మోటో జీ9 మోడ‌ల్ ను 11,499 రూపాయ‌ల ధ‌ర‌కు విక్రయించగా.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో రూ .9999 కు లభిస్తున్నది. ఈ ఆఫ‌ర్ నవంబర్ 30 వరకు కొనసాగనుంది. అలాగే మోటో జి 9తో పాటు ఇతర మోటోరోలా ఫోన్లపైనా ప‌లు ఆఫర్లను ప్రకటించింది. ఈనెల 26న ప్రారంభ‌మైన ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే 30 ముగిసిపోనుంది. ఈ ఆఫ‌ర్‌లో భాగంగా ప‌లు స్మార్ట్ ఫోన్లపై ప్రత్యేక త‌గ్గింపులు ఉన్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌పై 5శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

మోటో జీ 9 కొన్ని నెలల క్రితం భారతదేశంలో రూ.11,499 కు లాంచ్ అయింది. కానీ దీపావళి అమ్మకాల సమయంలో దీని ధర రూ.9999కే విక్రయించారు. ఇప్పుడు అదే ధ‌ర‌కు ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులో ఉంది. రూ.9999 లోపు అందుబాటులో ఉన్న ఫోన్లలో ఇది ఉత్తమ ఎంపిక‌గా చెప్పుకోవ‌చ్చు. ఎందుకంటే ఇందులో స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెస‌ర్‌ను వినియోగించారు. అలాగే ఇది క్లీన్ ఆండ్రాయిడ్‌తో వ‌స్తుంది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo