సోమవారం 25 మే 2020
Science-technology - Mar 31, 2020 , 22:10:05

కారును రోజు 15 నిమిషాలు స్టార్ట్ చేసి ఉంచండి...

కారును రోజు 15 నిమిషాలు స్టార్ట్ చేసి ఉంచండి...

హైదరాబాద్ : లాక్‌డౌన్‌ కాలంలో చాలా మంది నగరవాసులు తమ కారును కనీసం స్టార్ట్‌ చేయని పరిస్థితి నెలకొంది. ఏదైనా చిన్న చిన్న అవసరానికి బయటకు వెళ్ళాలన్నా స్కూటీ లేదా బైక్‌ను వాడుతున్నారు. ఇలా సుదీర్ఘ కాలం కారు తీయకపోతే లాక్‌డౌన్‌ అనంతరం కారు తీద్దామనుకుంటే చాలా సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీని నుండి కారును రక్షించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. 

  • ప్రతిరోజు లేదా రెండు మూడు రోజులకు ఒకసారి అయినా తప్పక కారు ఇంజన్‌ను స్టార్ట్‌ చేసి కనీసం 15 నిమిషాల పాటు ఉంచాలి. దీంతో బ్యాటరీ కూడా తనలోని శక్తని తిరిగి నింపుకుంటుంది.
  • కొద్ది రోజుల విరామం తరువాత చాలా ఎక్కువ సమయం స్టార్ట్‌ చేసినపుడు లైట్స్‌ కనీసం ఒక 30 నిమిషాల పాటు ఆన్‌ చేసి ఉంచడంతో లైట్లతో పాటు బ్యాటరీ కూడా ఎక్కువ కాలంమ లైఫ్‌ ఇస్తుంది.
  • కారు స్టార్ట్‌ చేసినపుడు ముందుకు లేదా వెనకకు కనీసం ఒక పది మీటర్లు కదిలించడం వల్ల టైర్లు డామేజ్‌ కాకుండా ఉంటాయి. 
  • హ్యండ్‌ బ్రేక్‌ను తీసి ఉంచడం వల్ల కారు భూమిపై సరిగ్గా పొంది టైర్లు అనుకూలంగా ఉంటాయి. దీంతో టైర్లపై సమానంగా భారం పడడం జరుగుతుంది.


logo