మంగళవారం 09 మార్చి 2021
Science-technology - Nov 01, 2020 , 19:36:08

గుడ్లగూబలు రాత్రిపూట ఎలా చూడగలుగుతున్నాయో తెలిసిపోయింది..!

గుడ్లగూబలు రాత్రిపూట ఎలా చూడగలుగుతున్నాయో తెలిసిపోయింది..!

హైదరాబాద్‌: గుడ్లగూబలు నిశాచరులు. రాత్రివేళ తమ ఆహారం కోసం వేటాడే మాంసాహారులు. అయితే, వీటికి రాత్రిపూట కళ్లు ఎలా కనిపిస్తాయి అనేది ఇప్పటివరకూ ఓ రహస్యమే. గుడ్లగూబలు మినహాయించి, మిగతా పక్షులు మనుషుల్లాగే పగటిపూట మేల్కొని, రాత్రిపూట నిద్రిస్తాయి. గుడ్లగూబలు మాత్రం ఇందుకు విరుద్ధం. అయితే, ఇటీవల కొందరు పరిశోధకులు గుడ్లగూబల నైట్‌విజన్‌ గుట్టువిపారు. వాటిలోని డీఎన్‌ఏ కంటి లెన్స్‌లాగా పనిచేస్తున్నట్లు తేల్చారు.  

పరిశోధకుల బృందం 11 గుడ్లగూబలతో సహా 20 వేర్వేరు పక్షి జాతుల జన్యువులపై అధ్యయనం చేసింది. జన్యువులలో ప్రయోజనకరమైన ఉత్పరివర్తనాలను గమనించారు. ఇంద్రియ జ్ఞానం రంగాలలో మార్పులను గుర్తించారు. అందుకే గుడ్లగూబలు బాగా వినగలవు, చూడగలవని తేల్చారు. అలాగే, 32 జన్యువులలో వేగవంతమైన పరిణామ సంకేతాలను కూడా బృందం కనుగొంది. ఈ జన్యువులు డీఎన్‌ఏ ప్యాకేజింగ్, క్రోమోజోమ్ సంగ్రహణతో అనుసంధానించబడ్డాయి. గుడ్లగూబ కళ్లలోని అణువుల నిర్మాణం వాస్తవానికి ఎక్కువ కాంతిని సంగ్రహించగలిగేలా  పనిచేస్తున్నట్లు పరిశోధకులు తేల్చారు. ఇదిలా ఉంటే, గుడ్లగూబలు చీకట్లో చూడగలుగుతున్నాయంటే ఈ డీఎన్‌ఏ అమరిక ఒక్కటే కారణం కాదని, వాటిలో రాడ్‌ కణాలతో నిండిన రెటినాస్‌ కూడా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. ఇవి చీకట్లో కూడా వాటి దృష్టి సామర్థ్యాన్ని పెంచుతున్నాయన్నారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo