న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక గగన్‌యాన్ ప్రాజెక్ట్‌లో భాగంగా వికాస్ ఇంజిన్‌కు మూడోసారి విజయవంతంగా హాట్ టెస్ట్ నిర్వహించిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)కు స్పేస్ఎక్స్ ఫౌండర్ ఎలోన్ మస్క్ కంగ్రాట్స్ చెప్పారు. బుధవారం ఈ టెస్ట్‌కు సంబంధించి ఇస్రో ట్వీట్ చేయగా.. దానిపై మస్క్ స్పందించారు. ఇస్రో ట్వీట్‌కే కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్ చేశారు. గగన్‌యాన్ ప్రాజెక్ట్ కోసం ఇంజిన్ అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఈ వికాస్ ఇంజిన్‌కు హాట్ టెస్ట్ నిర్వహించినట్లు ఇస్రో తన ట్వీట్లో వెల్లడించింది.
తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రపల్షన్ కాంప్లెక్స్ (ఐపీఆర్సీ)లో 240 సెకన్ల పాటు ఇంజిన్‌ను ఫైర్ చేసి చూశారు. అవసరమైన ప్రమాణాల మేరకే ఇంజిన్ పనితీరు ఉన్నదని ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ గగన్‌యాన్ యాత్ర కోసం ఇప్పటికే నలుగురు ఇండియన్ ఆస్ట్రోనాట్లు రష్యాలో శిక్షణ కూడా పొందారు.