సోమవారం 06 ఏప్రిల్ 2020
Science-technology - Feb 22, 2020 , 18:59:31

ఇక ఐఫోన్లలో థర్డ్‌పార్టీ డిఫాల్ట్‌ యాప్స్‌ను సెట్‌ చేసుకోవచ్చు..!

ఇక ఐఫోన్లలో థర్డ్‌పార్టీ డిఫాల్ట్‌ యాప్స్‌ను సెట్‌ చేసుకోవచ్చు..!

సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఆపిల్‌ తన ఐఓఎస్‌ ప్లాట్‌ఫాంపై ఓ అద్భుతమైన ఫీచర్‌ను త్వరలో యూజర్లకు అందుబాటులోకి తేనుంది. ఇకపై అందులో యూజర్లు థర్డ్‌ పార్టీ యాప్‌లను డిఫాల్ట్‌ యాప్‌లుగా సెట్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఐఫోన్లు, ఐప్యాడ్‌లు తదితర ఐఓఎస్‌ డివైస్‌లలో ఆపిల్‌ అందించే యాప్స్‌నే యూజర్లు డిఫాల్ట్‌గా ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇకపై వాటి స్థానంలో యూజర్లు తమకు నచ్చిన ఇతర థర్డ్‌పార్టీ యాప్స్‌ను డిఫాల్ట్‌ యాప్స్‌గా సెట్‌ చేసుకోవచ్చు. కాగా ఈ ఫీచర్‌ను ఆపిల్‌ తాను త్వరలో విడుదల చేయనున్న ఐఓఎస్‌ 14 వెర్షన్‌లో అందివ్వనున్నట్లు తెలిసింది. logo