ఆగస్టు 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్నాప్‌చాట్ సరికొత్త ఏఆర్ ఫీచర్‌ను ఇండియన్ యూజర్ల కోసం తీసుకొచ్చింది. ఏఆర్ ఫీచర్ అంటే.. ఆగ్మెంటెడ్ రియాల్టీ. దీనిలో భాగంగా లాండ్మార్కర్ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద.. ఆగ్మెంటెడ్ రియాల్టీ అనే ఫీచర్ ద్వారా అక్కడ ఉన్న అనుభూతిని కలిగించేలా రూపొందించారు. ఈ ఫీచర్‌ను స్నాప్‌చాట్ యూజర్లు యాక్సెస్ చేసుకోవచ్చు. దీనితో పాటు.. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. దానికి సంబంధించిన కొన్ని ఫిల్టర్లను స్నాప్‌చాట్ యాడ్ చేసింది.
అలాగే.. #MeraBharatMahan అనే హ్యాష్‌టాగ్‌ను కూడా క్రియేట్ చేసింది. ఈ హ్యాష్‌టాగ్‌ను ఉపయోగించి.. ఇండియన్ యూజర్లు.. స్వాతంత్య్ర దినోత్సవానికి సంబంధించిన పలు వీడియోలను స్నాప్‌చాట్‌లో క్రియేట్ చేయొచ్చు.
ఒకవేళ ఇండియా గేట్‌ను ఎవరైనా సందర్శిస్తే.. దాని దగ్గరికి వెళ్లి.. కెమెరాను ఇండియా గేట్‌కు పాయింట్ చేస్తూ… స్నాప్‌చాట్ యాప్‌ను ఓపెన్ చేస్తే.. ఏఆర్ ఫీచర్ యాక్టివ్ అయి.. ఇండియా గేట్ చుట్టూ జాతీయ జెండా రెపరెపలాడుతూ కనిపిస్తుంది.