శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Science-technology - Feb 22, 2021 , 15:14:41

భారీగా త‌గ్గిన స్మార్ట్‌ఫోన్ల అమ్మ‌కాలు

భారీగా త‌గ్గిన స్మార్ట్‌ఫోన్ల అమ్మ‌కాలు

అంత‌ర్జాతీయంగా 2020లో స్మార్ట్‌ఫోన్ల అమ్మ‌కాలు 12.5 శాతం మేర త‌గ్గిపోయిన‌ట్లు మార్కెట్ రీసెర్చ్ సంస్థ గార్ట్‌న‌ర్ వెల్ల‌డించింది. 2020 చివ‌రి త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ 5.4 శాతం మేర త‌గ్గిన‌ట్లు కూడా ఈ రిపోర్ట్ తెలిపింది. గ‌తేడాది డిసెంబ‌ర్‌లో మొత్తం మార్కెట్ షేర్‌లో 20.8 శాతంతో యాపిల్ టాప్ ప్లేస్‌లో ఉంది. ఇక త‌ర్వాతి స్థానంలో 16.2 శాతంతో సామ్‌సంగ్ ఉంది. షియోమీ, ఒప్పో, హువావీ త‌ర్వాతి మూడుస్థానాల్లో ఉన్నాయి. చివ‌రి త్రైమాసికంలో 5జీ స్మార్ట్‌ఫోన్లు, త‌క్కువ నుంచి మ‌ధ్య‌స్థ స్థాయి ఫోన్ల అమ్మ‌కాలు కాస్త పెర‌గ‌డంతో ఓవ‌రాల్‌గా మార్కెట్ విలువ‌ను కాస్త త‌గ్గించిన‌ట్లు గార్ట్‌న‌ర్ తెలిపింది. గ‌తేడాది క‌రోనా కార‌ణంగా ప్ర‌జ‌లు అవ‌స‌ర‌మైన వాటికి మాత్ర‌మే ఖ‌ర్చు చేయ‌డంతో ఈ ప‌రిస్థితి త‌లెత్తిన‌ట్లు ఆ సంస్థ అంచ‌నా వేసింది.

ఇండియాలోనూ అదే ప‌రిస్థితి

అంత‌ర్జాతీయంగానే కాకుండా ఇండియాలోనూ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ విలువ ప‌డిపోయింది. 2009 త‌ర్వాత తొలిసారి 2020లోనే ఇండియాలో స్మార్ట్‌ఫోన్ల షిప్‌మెంట్లు 2 శాతం త‌గ్గిన‌ట్లు ఇంట‌ర్నేష‌న‌ల్ డేటా కార్పొరేష‌న్ వెల్ల‌డించింది. 2020లో ఇండియాలో మొత్తం 15 కోట్ల స్మార్ట్‌ఫోన్లు షిప్ అయిన‌ట్లు తెలిపింది. 

VIDEOS

logo