సోమవారం 13 జూలై 2020
Science-technology - May 16, 2020 , 16:32:44

మీ స్మార్ట్‌ ఫోన్‌లో ఈ యాప్‌ ఉందా...

మీ స్మార్ట్‌ ఫోన్‌లో ఈ యాప్‌ ఉందా...

ఈ కాలంలో చేతిలో ఉండే ఆస్థి స్మార్ట్‌ ఫోన్‌. చేతిలో ఫోన్‌ లేదంటే ఎంత మందిలో ఉన్నా ఒంటరిగా అనిపిస్తుంది చాలా మందికి. అటువంటి ఫోన్‌ పోతే.. ఫోన్‌ పోయిందంటే అందులో ఉండే విలువైన సమాచారం మళ్ళీ పొందడం చాలా కష్టం. పోయిన ఫోన్‌ కోసం పోలీసులకు ఫిర్యాదు చేసినా అది దొరికే అవకాశాలు తక్కువే దొరికినా ఆ పాటికి అందులో ఉండే సమాచారం మెత్తం ఖాళీ చేసేస్తారు ఫోన్‌ దొరికిన వారు. అయితే మన ఫోన్‌ పోగొట్టుకున్నప్పుడు లేదా దొంగలించబడ్డప్పుడు ఆ ఫోన్‌ని అవతల వ్యక్తి కనీసం ఒక్క సారి అయినా లాక్‌ తెరవడానికి ప్రయత్నిస్తాడు. ఆ తరువాత ఫోన్‌ను స్విచ్చ్‌ ఆఫ్‌ చేసేస్తారు.

అయితే ఇటువంటి సమయంలో మన ఫోన్‌లో ఒక యాప్‌ ఉంటే మన ఫోన్‌ ఎవరి దగ్గర, ఏ ప్రాంతంలో ఉందో తెలిసే అవకాశం ఉంటుంది. అవును ‘క్రూక్‌ క్యాచర్‌' అనే యాప్‌ను మన మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుని ఉండి ఉంటే దాని ద్వారా మనకు మన ఫోన్‌ ఎవరి చేతిలో ఉందని లొకేషన్‌తో సహా తెలిసే అవకాశం ఉంటుంది. దీంతో వెంటనే ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఫోటోలో ఉన్న వ్యక్తిని నేరుగా పట్టేయొచ్చు. 

గూగుల్‌ ప్లే స్టోర్‌లో దొరికే ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని అందులో మన మేయిల్‌ ఐడీ ఎంటర్‌ చేసి ఉంచితే చాలు. మన ఫోన్‌ పోయినపుడు అవతతలి వ్యక్తి ఒక్కసారి తప్పుడు ప్యాటర్న్‌ కానీ తప్పుడు పాస్‌వర్డ్‌ కానీ ఎంటర్‌ చేయగానే మొబైల్‌లో ఉంటే ముందు కెమెరా, జీపీఎస్‌ అతనికి తెలియకుండానే యాక్టివ్‌ అయి మన మేయిల్‌ ఐడీకి ఫోటో, లొకేషన్‌ను పంపుతాయి. అంతే కాదు మన స్నేహితులు కూడా మనకు తెలియకుండా ఫోన్‌ వాడాలనుకున్నా మనకు తెలిసిపోతుంది. logo