మంగళవారం 31 మార్చి 2020
Science-technology - Mar 01, 2020 , 19:12:08

స్కాజెన్‌ ఫాల్‌స్టర్‌ 3 స్మార్ట్‌వాచ్‌ విడుదల

స్కాజెన్‌ ఫాల్‌స్టర్‌ 3 స్మార్ట్‌వాచ్‌ విడుదల

స్కాజెన్‌ కంపెనీ ఫాల్‌స్టర్‌ 3 పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్‌ వియర్‌ ఓఎస్‌ స్మార్ట్‌వాచ్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో గూగుల్‌కు చెందిన ఆండ్రాయిడ్‌ వియర్‌ ఓఎస్‌ను ఏర్పాటు చేశారు. జీపీఎస్‌, వాటర్‌ప్రూఫ్‌, 1.3 ఇంచ్‌ రౌండ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ వియర్‌ 3100 ప్లాట్‌ఫాం, 1జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌ తదితర ఫీచర్లను ఈ వాచ్‌లో అందిస్తున్నారు. ఇందులో గూగుల్‌ అసిస్టెంట్‌కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. అలాగే గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ ఫీచర్‌ను కూడా ఈ వాచ్‌లో ఉపయోగించుకోవచ్చు. బ్లూటూత్‌, వైఫై కనెక్టివిటీ, హార్ట్‌ రేట్‌ ట్రాకింగ్‌, ఎన్‌ఎఫ్‌సీ, ర్యాపిడ్‌ చార్జింగ్‌ ఫీచర్లను కూడా ఇందులో అందిస్తున్నారు. ఈ వాచ్‌ 24 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. రూ.21,995 ధరకు ఈ వాచ్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. 


logo
>>>>>>