‘సిగ్నల్’లో సాంకేతిక సమస్యలు

న్యూఢిల్లీ : వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ ప్రకటన్తో పెద్ద ఎత్తున జనం ప్రత్యామ్నాయ సిగ్నల్ యాప్ వైపు మొగ్గు చూపారు. దీంతో ఈ అనువర్తనంలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దీంతో పెద్ద ఎత్తున వినియోగదారులు సోషల్ మీడియాలోకి వెళ్లడంతో.. సంస్థ అధికారిక ట్విట్టర్ ద్వారా స్పందించింది. ‘సిగ్నల్ సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. వీలైనంత త్వరగా సేవలను పునరుద్ధరించేందుకు మేం తీవ్రంగా కృషి చేస్తున్నాం’ అని పోస్ట్ చేసింది. ‘మేం ఈ వారంలో ప్రతి రోజూ కొత్త సర్వర్లను, అదనపు సామర్థ్యాన్ని రికార్డు వేగంతో జత చేస్తున్నామని, కానీ ఈ రోజు మా అంచనాలకు మంచిపోయిందని’ తెలిపింది. ‘మిలియన్ల మంది కొత్త వినియోగదారులు గోప్యతకు సంబంధించిన సందేశాన్ని పంపుతున్నారని, వీలైనంత త్వరగా వారికి సేవ చేయండి’ అని సిగ్నల్ మెసెంజర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అరుణ హార్డర్ సిబ్బందికి సూచించారు.
ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్‌పై వాట్సాప్ నూతన ప్రైవసీ పాలనీని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున వినియోగదారులు తమ వ్యక్తిగత సమాచారం భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వాట్సాప్‌ను వీడి ఇతర ప్రత్యామ్నాయ యాప్‌లపై దృష్టి పెట్టారు. అమెరికన్ విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్ టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్, ట్విట్టర్ సీఈఓ జాక్ డార్సీ పబ్లిక్‌గా సిగ్నల్ యాప్‌ను వాడాలంటూ సిఫారసు చేసిన విషయం తెలిసిందే. దీంతో పెత్త ఎత్తున జనం సిగ్నల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. యాప్ అనలిటిక్స్ సంస్థ సెన్సార్ ప్రకారం.. సిగ్నల్ జనవరి 6-10 మధ్యకాలంలో భారత్‌లో 2.3 మిలియన్ల డౌన్లోడ్లను సాధించింది. అంతకు ముందు జనవరి 1-5 మధ్య కేవలం 24వేల డౌన్లోడ్లు మాత్రమే ఉన్నాయి.
వాట్సాప్ ప్రైవసీ విధానంపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సిగ్నల్, టెలిగ్రామ్ యాప్‌లపై మొగ్గు చూపు చూపారు. సెన్సార్ టవర్ ప్రకారం జనవరి 1 మరియు 5 మధ్య టెలిగ్రామ్ 1.5 మిలియన్ సార్లు డౌన్లోడ్ చేయబడింది. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో సిగ్నల్ డౌన్లోడన్ల సంఖ్య 50 మిలియన్లకు చేరింది. భారత్‌లో పెద్ద ఎత్తున వినియోగదారులు చేరడంతో సిగ్నల్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బ్రయాన్ ఆక్టన్ మీడియాతో మాట్లాడుతూ రాబోయే రెండేళ్లలో.. దేశంలో 100-200 మిలియన్లు వినియోగదారులను చేర్చుకోవాలని భావిస్తున్నారు. వాట్సాప్ వ్యవస్థాపకుల్లో ఆక్టన్ ఒకరు కాగా.. 2017లో ఆ కంపెనీని వీడారు.
తాజావార్తలు
- పల్లె.. ప్రగతి బాట పట్టిందో..’
- సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పూర్తైన లక్ష్యం
- భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం
- సైన్స్ విద్యార్థులకు ఐఐఎస్ఈఆర్ గొప్ప వేదిక : వినోద్ కుమార్
- తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్‌ఫ్రెండ్‌తో క్లోజ్‌గా శృతిహాసన్..ట్రెండింగ్‌లో స్టిల్స్