గురువారం 29 అక్టోబర్ 2020
Science-technology - Sep 29, 2020 , 06:57:36

వైరస్‌ను తినే సూక్ష్మజీవులు.. గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలు

వైరస్‌ను తినే సూక్ష్మజీవులు.. గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలు

న్యూయార్క్‌: సముద్ర జలాల్లో నివసించే ఓ రకమైన సూక్ష్మజీవులు వైరస్‌లను ఆహారంగా తింటాయని అమెరికన్‌ శాస్త్రవేత్తలు సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు. జలచర ఆహార గొలుసులో ప్రొటిస్టులుగా పిలిచే ఏక కణ సూక్ష్మ జీవులు వైరస్‌లను ఆహారంగా తీసుకుంటాయని తెలిపారు. ప్రొటిస్టుల కణంలో వివిధ రకాల వైరస్‌ల డీఎన్‌ఏలను గుర్తించినట్టు పేర్కొన్నారు. పర్యావరణానికి హితకారులుగా పిలిచే ప్రొటిస్టులు సముద్ర జలాల్లో కార్బన్‌ శాతాన్ని క్రమబద్ధీకరించడంలో కూడా సాయపడుతాయని వివరించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo