శనివారం 31 అక్టోబర్ 2020
Science-technology - Sep 03, 2020 , 20:14:55

ఏటీఎం మోసాలను అరికట్టేందుకు ఎస్‌బీఐ సరికొత్త ఫీచర్‌...!

ఏటీఎం మోసాలను అరికట్టేందుకు ఎస్‌బీఐ సరికొత్త ఫీచర్‌...!

ఢిల్లీ : కస్టమర్ల భద్రత కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మీరు ఏటీఎంకు వెళ్లి మీ బ్యాలెన్స్ లేదా మినీ స్టేట్మెంట్ తనిఖీ చేయాలనుకుంటే, ఎస్‌బీఐ ఒక ఎస్ఎంఎస్ పంపడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. కరోనావైరస్ మహమ్మారి మధ్య పెరుగుతున్న ఏటీఎం మోసాలను అరికట్టడానికి ఈ సౌకర్యం అరికడుతుంది. ఇటువంటి నేరాలు జరగ కుండా బ్యాంక్ తన కస్టమర్లను జాగ్రత్తగా ఉండాలని ట్విట్టర్ ద్వారా హెచ్చరించింది. బ్యాలెన్స్ ఎంక్వైరీ లేదా మినీ-స్టేట్మెంట్  తీసుకునేటప్పుడు ఎస్ఎంఎస్ హెచ్చరికలను విస్మరించవద్దని కోరింది.

"ఇప్పుడు మేము ఏటీఎంల ద్వారా బ్యాలెన్స్ ఎంక్వైరీ లేదా మినీ స్టేట్మెంట్ కోసం ఒక అభ్యర్థనను స్వీకరించినప్పుడు, మేము మా కస్టమర్లను ఒక ఎస్ఎంఎస్ పంపడం ద్వారా అప్రమత్తం చేస్తాము, తద్వారా లావాదేవీ ప్రారంభించకపోతే వారు వెంటనే వారి డెబిట్ కార్డును బ్లాక్ చేయవచ్చు" అని తన ట్వీట్‌లో పేర్కొన్నది. బ్యాంక్ తన వినియోగదారులకు వారి డబ్బును సురక్షితంగా ఉంచే మార్గాలపై చిట్కాలను ఇస్తోంది. "మీ భద్రతా వ్యవస్థలో కొంత లొసుగుల కోసం వెతుకుతున్న మోసగాళ్ళను గుర్తించడానికి మీ జ్ఞాన శక్తిని ఉపయోగించుకోండి. ఇక్కడ కొన్ని భద్రతా చిట్కాలు ఉన్నాయి" అని ఎస్‌బీఐ ట్వీట్ చేసింది.

ఇంతకుముందు, ఎస్‌బీఐ తన వినియోగదారులను అన్ని ఎస్‌బీఐ ఏటీఎంలలో అనధికార లావాదేవీల నుంచి రక్షించడానికి కార్డ్ లెస్ నగదు ఉపసంహరణ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త సౌకర్యం 2020 ప్రారంభం నుంచి చురుగ్గా ఉంది. ఏటీఎం కార్డుదారులకు వన్-టైమ్ పాస్వర్డ్ (ఒటిపి) సహాయంతో నగదు ఉపసంహరించుకునేందుకు వీలు కల్పిస్తుంది. రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల మధ్య రూ. 10,000 కంటే ఎక్కువ నగదు ఉపసంహరణ కోసం, ఎస్‌బీఐ కస్టమర్లు డెబిట్ కార్డ్ పిన్‌తో పాటు ఓటీపీని అందించాలి. అయితే ఎస్టీ పీ యేతర ఏటీఎం లలో ఓటీపీ ఆధారిత ఉపసంహరణ అందుబాటులో లేదు.