సోమవారం 30 మార్చి 2020
Science-technology - Feb 20, 2020 , 14:18:07

భారత్‌లో గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌ ధర ఎంతంటే..?

భారత్‌లో గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌ ధర ఎంతంటే..?

శాంసంగ్‌ సంస్థ గెలాక్సీ ఎస్‌ సిరీస్‌లో నూతన స్మార్ట్‌ఫోన్లను ఇటీవలే విడుదల చేసిన విషయం విదితమే. అలాగే గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌ పేరిట మరో మడతబెట్టే ఫోన్‌ను కూడా శాంసంగ్‌ లాంచ్‌ చేసింది. కాగా భారత్‌లో ఈ ఫోన్‌ ధరను శాంసంగ్‌ వెల్లడించింది. రూ.1,09,999 ధరకు ఈ ఫోన్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఈ సందర్భంగా పలు ఆఫర్లను కూడా అందిస్తున్నారు. 

గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌ ఫోన్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లకు 24X7 పాటు డెడికేటెడ్‌ కాల్‌ సెంటర్‌ సపోర్ట్‌ను అందివ్వనున్నారు. అలాగే యాక్సిడెంటల్‌ డ్యామేజ్‌ కవరేజ్‌, ఉచిత వన్‌ టైం స్క్రీన్‌ ప్రొటెక్షన్‌ ఆఫర్లు లభిస్తాయి. 1 ఏడాది పాటు శాంసంగ్‌ కేర్‌ ప్లస్‌ ప్రొటెక్షన్‌ లభిస్తుంది. 4 నెలల పాటు ఉచిత యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. ఇక ఈ ఫోన్‌ను 12 నెలల ఈఎంఐతో వడ్డీ లేకుండా కొనుగోలు చేసే సదుపాయాన్ని అందిస్తున్నారు. logo