గురువారం 13 ఆగస్టు 2020
Science-technology - Aug 01, 2020 , 11:36:25

స్మార్ట్‌ఫోన్లను శానిటైజ్ చేసే సరి కొత్త పరికరం‌..

 స్మార్ట్‌ఫోన్లను శానిటైజ్ చేసే సరి కొత్త పరికరం‌..

బెంగళూరు : కరోనా వైరస్ నేపథ్యంలో మనం వాడే ప్రతీ వస్తువును తప్పనిసరిగా శానిటైజ్ చేయాల్సిందే.. ముఖ్యంగా నిత్యం వినియోగించే స్మార్ట్ ఫోన్ పరిస్థితి ఏంటి...? అందుకోసమే ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ  శాంసంగ్ వినూత్న పరికరాన్ని ప్రవేశ పెట్టింది.  స్మార్ట్‌ఫోన్లు, ఇతర యాక్ససరీస్ శానిటైజ్ చే సేందుకు సరికొత్త పరికరాన్నిశాంసంగ్ ఆవిష్కరించింది. యూవీ స్టెరిలైజర్ పేరుతో ఈ డివైస్ ను విపణిలోకి ప్రవేశ పెట్టింది. దీంతో స్మార్ట్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్‌, కీస్‌, సన్ గ్లాసెస్‌ను కేవలం 10 నిమిషాల్లోనే శానిటైజ్ చేయవచ్చు. ఈ డివైస్‌కు ఓ బిల్టిన్ వైర్‌లెస్ చార్జర్‌ను అందిస్తున్నారు.

యూవీ స్టెరిలైజర్ ఓ బాక్స్‌ను పోలి ఉంటుంది. అందులో ఫోన్లు లేదా ఇతర వస్తువులను ఉంచితే వాటిపై ఉండే 99 శాతం బాక్టీరియా, వైరస్‌లు నాశనం అవుతాయి. ఈ డివైస్‌పై ఓ చిన్న బటన్‌ను ఏర్పాటు చేశారు. బాక్స్ లోపల డివైస్‌లను ఉంచి మూత పెట్టి పైన ఉండే బటన్‌ను ప్రెస్ చేస్తే చాలు. 10 నిమిషాల్లో లోపల ఉన్న డివైస్‌లు ఆటోమేటిక్ గా శానిటైజ్ అవుతాయి. దీని వల్ల వాటిపై ఉండే సూక్ష్మ క్రిములు పూర్తిగా నశిస్తాయి. అన్ని రకాల ఫోన్లను, హెడ్ సెట్స్ , ఇయర్ బడ్స్ ‌ను శానిటైజ్ చేసుకునేందుకు వీలుగా ఈ డివైస్‌ను తీర్చిదిద్దారు. శాంసంగ్ యూవీ స్టెరిలైజర్‌ను వినియోగదారులు శాంసంగ్ ఆఫ్‌లైన్ స్టోర్లు, లేదా ఆన్‌లైన్ స్టోర్ల తోపాటు ఇతర రిటెయిల్ స్టోర్స్‌లో ను అందుబాటు లో ఉన్నది. దీని ధర రూ.3,599. 


logo