శుక్రవారం 05 జూన్ 2020
Science-technology - Feb 12, 2020 , 11:50:26

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌20 సిరీస్.. అదుర్స్‌..!

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌20 సిరీస్.. అదుర్స్‌..!

ఎల‌క్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ త‌న నూత‌న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు గెలాక్సీ ఎస్‌20, ఎస్‌20 ప్ల‌స్‌, ఎస్‌20 అల్ట్రాల‌ను విడుద‌ల చేసింది. ముందు నుంచీ చెబుతున్న‌ట్లుగానే గెలాక్సీ ఎస్ సిరీస్‌లో ఎస్‌11కు బ‌దులుగా శాంసంగ్ ఎస్‌20 సిరీస్ ఫోన్ల‌ను విడుద‌ల చేసింది. భార‌త కాల‌మానం ప్ర‌కారం బుధ‌వారం రాత్రి 12.30 గంట‌ల‌కు శాన్ ఫ్రాన్సిస్కోలో శాంసంగ్‌ నిర్వ‌హించిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో ఆ కంపెనీ ఈ ఫోన్ల‌ను లాంచ్ చేసింది. ఇక ఈ ఫోన్ల‌లో అందిస్తున్న ఫీచ‌ర్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. 

గెలాక్సీ ఎస్20, ఎస్‌20 ప్ల‌స్ ఫీచ‌ర్లు...

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌20 స్మార్ట్‌ ఫోన్‌లో 6.2 ఇంచులు, ఎస్‌20 ప్ల‌స్‌లో 6.7 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ డైన‌మిక్ అమోలెడ్ 2ఎక్స్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేల‌ను ఏర్పాటు చేశారు. వీటి డిస్‌ప్లేల‌కు 120హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీ బాగుంటుంది. ఈ ఫోన్ల‌లో ఆయా దేశాల మార్కెట్‌ల‌కు అనుగుణంగా స్నాప్‌డ్రాగ‌న్ 865 లేదా ఎగ్జినోస్ 990 ప్రాసెస‌ర్‌లు వినియోగ‌దారుల‌కు ల‌భిస్తాయి. ఈ ఫోన్ల‌లో 5జి ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. అందుకు గాను ప్ర‌త్యేక వేరియెంట్ల‌ను లాంచ్ చేశారు. ఇక ఈ ఫోన్ల‌లో అల్ట్రాసోనిక్ ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్లు ఏర్పాటు చేసినందున‌ ఈ డివైస్‌ల‌ను యూజ‌ర్లు చాలా వేగంగా అన్‌లాక్ చేసుకునేందుకు వీలుంటుంది. అలాగే ఆండ్రాయిడ్ 10 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌, శాంసంగ్ బిక్స్‌బీ, హెల్త్‌, శాంసంగ్ పే యాప్‌లు.. త‌దిత‌ర ఇత‌ర ఫీచ‌ర్ల‌ను కూడా ఈ ఫోన్ల‌లో యూజ‌ర్లు పొంద‌వ‌చ్చు. 

గెలాక్సీ ఎస్‌20 స్మార్ట్‌ఫోన్‌లో వెనుక భాగంలో 3 కెమెరాల‌ను ఏర్పాటు చేయ‌గా, వాటిలో 12 మెగాపిక్స‌ల్ ప్రైమ‌రీ సెన్సార్‌తోపాటు మ‌రో 12 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ లెన్స్, 64 మెగాపిక్స‌ల్ టెలిఫొటో లెన్స్ ఉన్నాయి. ఈ కెమెరాల‌కు ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (ఓఐఎస్‌) ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల ఫోన్ క‌దులుతున్నా నాణ్య‌మైన‌ ఫొటోల‌ను తీసుకోవ‌చ్చు. అలాగే గెలాక్సీ ఎస్‌20 ప్ల‌స్‌లో ఈ కెమెరాల‌తోపాటు అద‌నంగా మ‌రో డెప్త్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ల‌లో ముందు భాగంలో 10 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఈ కెమెరాల‌ ద్వారా యూజ‌ర్లు ఏకంగా 8కె రిజ‌ల్యూష‌న్ క‌లిగిన‌ వీడియోల‌ను చాలా సుల‌భంగా షూట్ చేసుకోవ‌చ్చు. ఈ ఫోన్ల‌లో ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, 4000/4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌, ఫాస్ట్ వైర్‌లెస్ చార్జింగ్‌, వైర్‌లెస్ ప‌వ‌ర్‌షేర్ త‌దిత‌ర ప‌వ‌ర్‌ఫుల్‌ ఫీచ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు.


గెలాక్సీ ఎస్20, ఎస్‌20 ప్ల‌స్ ఫోన్ల స్పెసిఫికేష‌న్లు…

* ఎస్‌20 – 6.2 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ డైన‌మిక్ అమోలెడ్ 2ఎక్స్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 3200 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్

* ఎస్‌20 ప్ల‌స్ – 6.7 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ డైన‌మిక్ అమోలెడ్ 2ఎక్స్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌, 3200 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్

* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 865 / ఆక‌్టాకోర్ శాంసంగ్ ఎగ్జినోస్ 990 ప్రాసెస‌ర్‌

* ఎస్‌20 – 8/12 (5జి) జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌

* ఎస్‌20 ప్ల‌స్ – 8/12 (5జి) జీబీ ర్యామ్‌, 128/256 (5జి)/512 (5జి) జీబీ స్టోరేజ్‌

* ఆండ్రాయిడ్ 10, సింగిల్/హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్

* 12, 64, 12 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, ఎస్‌20 ప్ల‌స్ – డెప్త్ విజ‌న్ కెమెరా

* 10 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్

* డాల్బీ అట్మోస్, అల్ట్రా సోనిక్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్, 5జి, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ

* ఎస్‌20 – 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ ఫాస్ట్‌ చార్జింగ్‌, వైర్‌లెస్ ప‌వ‌ర్‌షేర్

* ఎస్‌20ప్ల‌స్ – 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ ఫాస్ట్‌ చార్జింగ్‌, వైర్‌లెస్ ప‌వ‌ర్‌షేర్

శాంసంగ్ గెలాక్సీ ఎస్20 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ఫీచ‌ర్లు…

శాంసంగ్ గెలాక్సీ ఎస్20 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లో 6.97 ఇంచుల సైజ్ ఉన్న‌ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ డైన‌మిక్ అమోలెడ్ 2ఎక్స్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఈ డిస్‌ప్లే 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ ఫీచ‌ర్‌ను క‌లిగి ఉంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగ‌న్ 865 లేదా ఎగ్జినోస్ 990 ప్రాసెస‌ర్ ల‌భిస్తుంది. అలాగే 5జి ఫీచ‌ర్‌ను కూడా ఈ ఫోన్‌లో వినియోగ‌దారులు పొంద‌వ‌చ్చు. 16జీబీ ప‌వ‌ర్‌ఫుల్ ర్యామ్‌ ఈ ఫోన్‌లో లభిస్తుంది. ఇన్ డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఆండ్రాయిడ్ 10, శాంసంగ్ బిక్స్‌బీ, హెల్త్‌, శాంసంగ్ పే యాప్‌లు.. త‌దిత‌ర ఇత‌ర ఫీచ‌ర్ల‌ను కూడా ఈ ఫోన్‌లో వినియోగ‌దారులు పొంద‌వ‌చ్చు. 

గెలాక్సీ ఎస్‌20 అల్ట్రా స్మార్ట్‌ ఫోన్‌ వెనుక భాగంలో 108 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను అందిస్తున్నారు. దీంతోపాటు 12 మెగాపిక్స‌ల్ కెపాసిటీ క‌లిగిన‌ అల్ట్రా వైడ్ లెన్స్‌, 48 మెగాపిక్స‌ల్ టెలిఫొటో లెన్స్‌ కూడా ఈ ఫోన్ వెనుక భాగంలో ఉన్నాయి. అందువ‌ల్ల ఈ కెమెరాల‌తో 100ఎక్స్ సూప‌ర్ రిజ‌ల్యూష‌న్ జూమ్ ల‌భిస్తుంది. అలాగే వెనుక కెమెరాల‌కు తోడుగా మ‌రో డెప్త్ సెన్సార్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇక ముందు భాగంలో 40 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ ద్వారా కూడా యూజ‌ర్లు అద్భుత‌మైన క్వాలిటీ క‌లిగిన 8కె రిజ‌ల్యూష‌న్ ఉన్న‌ వీడియోల‌ను సుల‌భంగా చిత్రీకరించుకోవచ్చు. ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిసెన్స్‌, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌, ఫాస్ట్ వైర్‌లెస్ చార్జింగ్‌, వైర్‌లెస్ ప‌వ‌ర్‌షేర్.. త‌దిత‌ర ఇత‌ర ఫీచ‌ర్ల‌ను ఈ ఫోన్‌లో వినియోగ‌దారులు పొంద‌వ‌చ్చు. 


శాంసంగ్ గెలాక్సీ ఎస్‌20 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేష‌న్లు... 

* 6.9 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ డైన‌మిక్ అమోలెడ్ 2ఎక్స్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌, 3200 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్

* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 865 / ఆక్టాకోర్ శాంసంగ్ ఎగ్జినోస్ 990 ప్రాసెస‌ర్‌, 12/16 జీబీ ర్యామ్‌, 128/512 జీబీ స్టోరేజ్

* ఆండ్రాయిడ్ 10, సింగిల్‌/హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌

* 108, 48, 12 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, డెప్త్ విజ‌న్ కెమెరా, 40 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా

* ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డాల్బీ అట్మోస్‌, అల్ట్రాసోనిక్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్

* 5జి, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ

* 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ ప‌వ‌ర్ షేర్

ధ‌ర‌ల వివ‌రాలు... 

* గెలాక్సీ ఎస్‌20 4జి - 981 డాల‌ర్లు (దాదాపుగా రూ.69,980) 

* గెలాక్సీ ఎస్‌20 5జి - 999 డాల‌ర్లు (దాదాపుగా రూ.71,325) 

* గెలాక్సీ ఎస్‌20 ప్ల‌స్ 5జి 128జీబీ - 1199 డాల‌ర్లు (దాదాపుగా రూ.85,590) 

* గెలాక్సీ ఎస్‌20 ప్ల‌స్ 5జి 512జీబీ - 1299 డాల‌ర్లు (దాదాపుగా రూ.92,720) 

* గెలాక్సీ ఎస్‌20 అల్ట్రా 5జి 12జీబీ + 128జీబీ - 1399 డాల‌ర్లు (దాదాపుగా రూ.99,840) 

* గెలాక్సీ ఎస్‌20 అల్ట్రా 5జి 16జీబీ + 512జీబీ - 1499 డాల‌ర్లు (దాదాపుగా రూ.1,06,975) 

కాగా ఈ ఫోన్ల‌కు గాను ఈ నెల 21వ తేదీ నుంచి ప్రీ ఆర్డ‌ర్లు ప్రారంభం కానున్నాయి. ఇక మార్చి 6వ తేదీ నుంచి వీటిని మార్కెట్‌లో విక్ర‌యిస్తారు. అయితే ఈ ఫోన్లను భార‌త్‌లో ఎప్పుడు విడుద‌ల చేసేదీ, వాటి ధ‌ర వివ‌రాల‌ను శాంసంగ్ ఇంకా వెల్ల‌డించ‌లేదు.


logo