గురువారం 02 ఏప్రిల్ 2020
Science-technology - Feb 27, 2020 , 14:42:19

హైదరాబాద్‌లో గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌ స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు షురూ..!

హైదరాబాద్‌లో గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌ స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు షురూ..!

శాంసంగ్‌ కంపెనీ తన గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌ స్మార్ట్‌ఫోన్‌కు గాను ఇటీవలే భారత్‌లో ప్రీ ఆర్డర్లను ప్రారంభించిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్‌ ప్రస్తుతం మార్కెట్‌లో వినియోగదారులకు లభిస్తున్నది. హైదరాబాద్‌లో ఈ ఫోన్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. పంజాగుట్టలోని సమీర్‌ కమ్యూనికేషన్స్‌లో గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను విక్రయిస్తున్నారు. ఈ మేరకు స్టోర్‌లో ఇప్పటికే ఈ ఫోన్‌కు విక్రయాలు ప్రారంభమయ్యాయి. కాగా ఈ ఫోన్‌ ధర భారత్‌లో రూ.1,09,999గా ఉంది. 


గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌ స్మార్ట్‌ఫోన్‌లో.. 6.7 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ప్లస్‌ ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌, 12, 12 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, 10 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, బ్లూటూత్‌ 5.0, యూఎస్‌బీ టైప్‌ సి, ఎన్‌ఎఫ్‌సీ, శాంసంగ్‌ నాక్స్‌ సెక్యూరిటీ, ఫేషియల్‌ రికగ్నిషన్‌, 3300 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌, వైర్‌లెస్‌ చార్జింగ్‌.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు. 


logo
>>>>>>