ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Science-technology - Jan 16, 2021 , 19:17:41

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌21 ఆల్ట్రా 5G బుకింగ్స్‌ ప్రారంభం

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌21 ఆల్ట్రా 5G బుకింగ్స్‌ ప్రారంభం

న్యూఢిల్లీ సౌత్‌ కొరియా టెక్‌ దిగ్గజం శాంసంగ్‌ ప్రపంచవ్యాప్తంగా గెలాక్సీ ఎస్‌ 21 సిరీస్‌లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను గురువారం ఆవిష్కరించింది. అత్యంత ఖరీదైన కొత్త ఫోన్‌ గెలాక్సీ ఎస్‌ 21 ఆల్ట్రా 5జీ ప్రీ-బుకింగ్స్‌ను భారత్‌లో ప్రారంభించింది. గెలాక్సీ ఎస్ 21 సిరీస్‌లో   గెలాక్సీ ఎస్ 21 +, గెలాక్సీ ఎస్ 21,  గెలాక్సీ ఎస్ 21 అల్ట్రాలను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే.   గెలాక్సీ ఎస్‌21 సిరీస్‌ ఫోన్‌ ప్రారంభ ధర రూ.69,999గా ఉంది.  ఎస్‌ 21 ఆల్ట్రా మోడల్‌ ధర అత్యధికంగా 1,16,999గా నిర్ణయించారు. 

ఎస్‌21 ఆల్ట్రా ఫోన్‌లో 12జీబీ ర్యామ్‌ + 128 జీబీ స్టోరేజ్  మోడల్‌  ధర రూ.1,05,999గా ఉంది.  టాప్-ఎండ్ 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్  ఫోన్‌ ధర రూ. 1,16,999గా ఉంది.   108 మెగా పిక్సల్‌ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్‌ విడుదలైంది.   ఎస్ పెన్ సపోర్ట్‌తో వచ్చిన మొదటి గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్ ఇదే కావడం విశేషం. 

VIDEOS

logo