మంగళవారం 19 జనవరి 2021
Science-technology - Nov 04, 2020 , 17:36:00

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌21 సిరీస్‌ లాంచ్‌ ఎప్పుడంటే..!

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌21 సిరీస్‌ లాంచ్‌ ఎప్పుడంటే..!

ముంబై:  టెక్ దిగ్గజం శాంసంగ్  గెలాక్సీ ఎస్‌ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించనుంది.  ఇటీవల ఎస్‌ సిరీస్‌లో గెలాక్సీ ఎస్‌20 ఎఫ్‌ఈ మోడల్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వచ్చే  ఏడాది జనవరిలో అద్భుత ఫీచర్లతో  కొత్త ఫోన్లను  లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.  2021 జనవరి 14న గెలాక్సీ ఎస్ 21  సిరీస్‌ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయాలని శాంసంగ్‌  ప్రయత్నిస్తోంది.

ప్రీ-ఆర్డర్లు కూడా అదే రోజున ప్రారంభించాలని చూస్తోంది.  సిరీస్‌లో గెలాక్సీ ఎస్‌21, గెలాక్సీ ఎస్‌21+, గెలాక్సీ ఎస్‌21 ఆల్ట్రా స్మార్ట్‌ఫోన్లు విక్రయాలు  జనవరి 29న మొదలవనున్నట్లు తెలిసింది. బ్లాక్‌, వైట్‌,గ్రే, సిల్వర్‌, వయోలెట్‌, పింక్‌ కలర్లలో లభించనుంది.