సోమవారం 21 సెప్టెంబర్ 2020
Science-technology - Aug 06, 2020 , 14:24:31

గెలాక్సీ నోట్‌20 సిరీస్‌ ప్రీ-బుకింగ్స్ ప్రారంభం..10వేల విలువైన ప్రయోజనాలు!

గెలాక్సీ నోట్‌20 సిరీస్‌ ప్రీ-బుకింగ్స్ ప్రారంభం..10వేల విలువైన ప్రయోజనాలు!

ముంబై: స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం  శాంసంగ్ గెలాక్సీ నోట్‌ 20 సిరీస్‌లో సరికొత్త ఫోన్లను ఆవిష్కరించింది. భారత్‌లో గెలాక్సీ నోట్‌ 20, గెలాక్సీ నోట్‌ 20 ఆల్ట్రా 5జీ స్మార్ట్‌ఫోన్‌ కోసం ప్రీ-బుకింగ్‌ ప్రారంభిస్తున్నట్లు  శాంసంగ్‌ తెలిపింది. భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 ధర  రూ .77,999 కాగా, హై వేరియంట్  గెలాక్సీ నోట్ 20 అల్ట్రా 5జీ  రూ .1,04,999గా ఉండనుంది.  నోట్‌ 20, నోట్‌ 20 ఆల్ట్రా 5జీ కూడా ఎయిర్‌టెల్‌, జియో ఇసిమ్‌(eSIM)ను సపోర్ట్‌ చేస్తాయి. 

 శాంసంగ్‌.కామ్,  ప్రముఖ రిటైల్ దుకాణాలలో  గెలాక్సీ నోట్ 20 సిరీస్ ఫోన్ల   ప్రీ-బుకింగ్  ఈ రోజు ఆగస్టు 6 నుంచి  ప్రారంభమైంది. గెలాక్సీ నోట్ 20ని  ప్రీ-బుక్ చేసే వినియోగదారులకు రూ .7 వేల విలువైన ప్రయోజనాలు లభిస్తాయి.  అలాగే,  గెలాక్సీ నోట్ 20 అల్ట్రా 5జీ  ప్రీ-బుకింగ్ చేసిన వారు  రూ .10,000 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు.


logo