మంగళవారం 27 అక్టోబర్ 2020
Science-technology - Sep 17, 2020 , 16:11:40

శాంసంగ్‌ గెలాక్సీ నోట్ 20పై 15వేల తగ్గింపు

శాంసంగ్‌ గెలాక్సీ నోట్ 20పై  15వేల    తగ్గింపు

న్యూఢిల్లీ: సౌత్‌కొరియా టెక్‌ దిగ్గజం శాంసంగ్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. భారత్‌లో గెలాక్సీ నోట్‌ 20 స్మార్ట్‌ఫోన్‌పై రూ.15వేల డిస్కౌంట్‌ను అందిస్తోంది. శాంసంగ్‌ డేస్‌ సేల్‌లో భాగంగా   ఫోన్‌పై  కంపెనీ  రూ.9వేల తగ్గింపును ఇస్తున్నది. దీంతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుదారులకు రూ.6వేల క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ కూడా ఉంది.  గెలాక్సీ నోట్‌ 20 లాంచింగ్‌ ధర రూ.77,999గా ఉండగా ఇప్పుడు 9వేల తక్షణ రాయితీ రూ.68,999కే కొనుగోలు చేయొచ్చు.

ఒకవేళ హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో కొనుగోలు చేస్తే మరో ఆరువేల రూపాయలు తగ్గనుండటంతో స్మార్ట్‌ఫోన్‌ను 62,999కే వినియోగదారులు కొనుగోలు చేయొచ్చు. ఈ ఆఫర్‌ సెప్టెంబర్‌ 23 వరకు అందుబాటులో ఉంది.  శాంసంగ్‌.కామ్‌తో పాటు శాంసంగ్‌ స్టోర్లు, ప్రముఖ ఆన్‌లైన్‌ పోర్టళ్లు, రిటైల్‌ స్టోర్లలో డిస్కౌంట్‌ లభిస్తున్నది. 

గెలాక్సీ నోట్‌ 20 స్పెసిఫికేషన్లు:

డిస్‌ప్లే: 6.70 అంగుళాలు

ప్రాసెసర్‌: శాంసంగ్‌ ఎక్సీనోస్‌ 990

ఫ్రంట్‌ కెమెరా: 10 మెగా పిక్సల్‌

రియర్‌ కెమెరా: 12+64+12 మెగా పిక్సల్‌

ర్యామ్‌: 8జీబీ

స్టోరేజ్‌: 256జీబీ

బ్యాటరీ కెపాసిటీ: 4300mAh

ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 10logo