శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Science-technology - Jan 17, 2021 , 14:53:45

7,000mAh బ్యాట‌రీతో వ‌స్తున్న శాంసంగ్ కొత్త ఫోన్‌..!

7,000mAh బ్యాట‌రీతో వ‌స్తున్న శాంసంగ్ కొత్త ఫోన్‌..!

న్యూఢిల్లీ: సౌత్‌ కొరియా టెక్‌ దిగ్గజం శాంసంగ్ ఎం సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురాబోతున్నది.   శాంసంగ్‌ గెలాక్సీ ఎం62 పేరుతో విడుదలకాబోతున్న స్మార్ట్‌ఫోన్‌లో  7,000mAh బ్యాటరీ ఉండనుంది.  భారీ బ్యాటరీతో పాటు 25W ఫాస్ట్‌ ఛార్జర్‌ కూడా ఫోన్‌తో పాటు వస్తున్నది. గెలాక్సీ ఎం51 ఫోన్‌కు తర్వాతి వెర్షన్‌గా  గెలాక్సీ ఎం62ను త్వరలోనే మార్కెట్లో ఆవిష్కరించబోతున్నారు.

ఈ స్మార్ట్‌ఫోన్ 4జీ ఎల్‌టిఇ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై,  ఎన్‌ఎఫ్‌సి  సపోర్ట్‌తో రావొచ్చు.  నూతన ఫోన్‌  ఎక్సినోస్ 9825 ప్రాసెసర్‌తో పాటు 6 జీబీ ర్యామ్‌తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేయనున్నట్లు సమాచారం.  ఈ ఫోన్‌ ధర రూ.25వేల లోపు ఉండొచ్చని తెలుస్తోంది. 

VIDEOS

logo