e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News శాంసంగ్‌ నుంచి గెలాక్సీ M32 స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది!

శాంసంగ్‌ నుంచి గెలాక్సీ M32 స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది!

శాంసంగ్‌ నుంచి గెలాక్సీ  M32 స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది!

సౌత్‌కొరియా టెక్‌ దిగ్గజం శాంసంగ్‌ తన గెలాక్సీ M-సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. మిడ్‌రేంజ్‌లో గెలాక్సీ M32 పేరుతో ఫోన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్‌ రియల్‌మీ8, పొకో ఎం3 ప్రొ, రెడ్‌మీ నోట్‌ 10 వంటి మోడళ్లకు గట్టిపోటీనివ్వనుంది. ఎం-సిరీస్‌లో ఇప్పటికే గెలాక్సీ ఎం31, గెలాక్సీ ఎం 31ఎస్‌, గెలాక్సీ ఎం 51 మోడళ్లను రిలీజ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6,000 mAh బ్యాటరీతో వస్తుండగా 25 W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది.

శాంసంగ్‌ గెలాక్సీ ఎం32 రెండు స్టోరేజ్‌ వేరియంట్లలో వస్తుంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .14,999 కాగా, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .16,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ బ్లాక్‌, లైట్‌ బ్లూ కలర్లలో విడుదలైంది.

- Advertisement -

జూన్ 28న మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్.ఇన్, శాంసంగ్‌.కామ్, రిటైల్ స్టోర్ల నుంచి ఈ ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. ఐసీఐసీఐ కార్డులతో కొనుగోలు చేస్తే వినియోగదారులు 1,250 ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
శాంసంగ్‌ నుంచి గెలాక్సీ  M32 స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది!
శాంసంగ్‌ నుంచి గెలాక్సీ  M32 స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది!
శాంసంగ్‌ నుంచి గెలాక్సీ  M32 స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది!

ట్రెండింగ్‌

Advertisement