గురువారం 02 ఏప్రిల్ 2020
Science-technology - Feb 25, 2020 , 15:51:16

6000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో విడుదలైన గెలాక్సీ ఎం31 స్మార్ట్‌ఫోన్‌

6000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో విడుదలైన గెలాక్సీ ఎం31 స్మార్ట్‌ఫోన్‌

శాంసంగ్‌ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ ఎం31ను ఇవాళ భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 6.4 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఇన్ఫినిటీ-యు సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6జీబీ పవర్‌ఫుల్‌ ర్యామ్‌ను అందిస్తున్నారు. వెనుక భాగంలో 64, 8, 5, 5 మెగాపిక్సల్‌ కెమెరాలు ఉండగా, ముందు భాగంలో 32 మెగాపిక్సల్‌ కెమెరా ఉంది. ఇందులో డెడికేటెడ్‌ డ్యుయల్‌ సిమ్‌, మైక్రోఎస్‌డీ స్లాట్లను ఏర్పాటు చేశారు. 6000 ఎంఏహెచ్‌ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీలో ఇందులో అందిస్తున్నారు. దీనికి 15 వాట్ల ఫాస్ట్‌ చార్జింగ్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్‌ను చాలా వేగంగా చార్జింగ్‌ చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.14,999 ఉండగా, 128 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.15,999గా ఉంది. ఈ ఫోన్‌ను మార్చి 5వ తేదీ నుంచి అమెజాన్‌లో విక్రయించనున్నారు. 

శాంసంగ్‌ గెలాక్సీ ఎం31 ఫీచర్లు... 

  • 6.4 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఇన్ఫినిటీ-యు సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే 
  • 2340 x 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌
  • ఆక్టాకోర్‌ ఎగ్జినోస్‌ 9611 ప్రాసెసర్‌, 6జీబీ ర్యామ్‌
  • 64/128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌ 
  • ఆండ్రాయిడ్‌ 10, డ్యుయల్‌ సిమ్‌ 
  • 64, 8, 5, 5 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు 
  • 32 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ 
  • డాల్బీ అట్మోస్‌, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.0
  • యూఎస్‌బీ టైప్‌ సి, 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌ 


logo
>>>>>>