లండన్: రాజస్థాన్ రాయల్స్‌కు చేదు వార్త. ఇప్పటికే ఐపీఎల్లో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్ రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్చర్ బరిలోకి దిగడని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. వేలి గాయంతో రాజస్థాన్ ఆల్‌రౌండర్ స్టోక్స్ ఇప్పటికే లీగ్‌కు దూరమైన విషయం తెలిసిందే.