శనివారం 04 జూలై 2020
Science-technology - Jun 02, 2020 , 13:56:49

సామ్‌సంగ్‌ గెలాక్సీ బడ్జెట్‌ ఫోన్లు

సామ్‌సంగ్‌ గెలాక్సీ బడ్జెట్‌ ఫోన్లు

హైదరాబాద్‌: ప్రముఖ మొబైల్‌ తయారుదారు సామ్‌సంగ్‌ తన గెలాక్సీ సిరీస్‌లో రెండు బడ్జెట్‌ ఫోన్లను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. సరికొత్త మోడళ్లయిన గెలాక్సీ ఎం11, గెలాక్సీ ఎం01 ఫోన్లు అన్ని సామ్‌సంగ్‌ ఆఫ్‌లైన్‌ స్టోర్లలో, సామ్‌సంగ్‌.కామ్‌లో, ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌ అయిన అమెజన్‌ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు ఫోన్లలో మెరుగైన ఆడియో అనుభూతి కోసం డాల్బీ ఏటీఎంవోఎస్‌ ఫీచర్‌ను వినియోగించడంతోపాటు సామ్‌సంగ్‌ హెల్త్‌ యాప్‌ ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నది. గెలాక్సీ ఎం11 మొబైల్‌ 3జీబీ, 4జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఫోన్లు బ్లూ, బ్లాక్‌, వైలట్‌, రెండ్‌ కలర్లలో అందుబాటులో ఉన్నాయి. మెమరీ కార్డుతో 512 జీబీ వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

ఫీచర్లు

గెలాక్సీ ఎం 11

డిస్‌ప్లే: 6.4 ఇంచ్‌ హెచ్‌డీ+టీఎఫ్‌టీ ఎల్‌సీడీ

ప్రాసెసర్‌: ఆక్టాకోర్‌

కెమెరా: 13 ఎంపీ+2 ఎంపీ+5 ఎంపీ (రియర్‌), 8 ఎంపీ (ఫ్రంట్‌)

బ్యాటరీ: 5000 ఎంఏహెచ్‌

ర్యామ్‌: 3జీబీ

స్టోరేజ్‌: 32 జీబీ

ధర: రూ.10,999

ర్యామ్‌: 4జీబీ

స్టోరేజ్‌: 64 జీబీ

ధర: రూ.12,999

గెలాక్సీ ఎం1

డిస్‌ప్లే: 5.7 హెచ్‌డీ + ఇన్ఫినిటీ-V డిస్‌ప్లే

ప్రాసెసర్‌: ఆక్టాకోర్‌

కెమెరా: 13 ఎంపీ + 2 ఎంపీ (రియర్‌), 5 (ఎంపీ)

బ్యాటరీ: 4000 ఎంఏహెచ్‌


logo