శుక్రవారం 05 మార్చి 2021
Science-technology - Feb 09, 2021 , 15:11:54

శాంసంగ్‌ గెలాక్సీ M02 సేల్‌ షురూ

శాంసంగ్‌ గెలాక్సీ M02 సేల్‌ షురూ

న్యూఢిల్లీ: సౌత్‌కొరియా మొబైల్‌ మేకర్‌ శాంసంగ్‌ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన శాంసంగ్‌ గెలాక్సీ M02 ఫోన్‌ విక్రయాలను తొలిసారి భారత్‌లో  ప్రారంభించింది.  ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్, శాంసంగ్‌ ఇండియా  ఆన్‌లైన్ స్టోర్, ప్రముఖ ఆఫ్‌లైన్ రిటైల్  స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.   డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, క్వాడ్-కోర్ మీడియాటెక్  ప్రాసెసర్‌,  5,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.  

శాంసంగ్‌ ఎం స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌లో గెలాక్సీ M51, గెలాక్సీ M31ఎస్‌, గెలాక్సీ M31 ఫోన్లను రిలీజ్‌ చేసింది.  భారత్‌లో  గెలాక్సీ ఎం02(2GB ర్యామ్‌ + 32GB స్టోరేజ్‌) ధర రూ.6,799గా ఉంది. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధ‌ర‌ ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 7,299గా ఉంది.   బ్లాక్‌, బ్లూ, గ్రే, రెడ్‌ కలర్లలో అందుబాటులో ఉంది

గెలాక్సీ ఎం2 స్పెసిఫికేషన్లు:

డిస్‌ప్లే:6.50 అంగుళాలు

ఫ్రంట్‌ కెమెరా:5 మెగా పిక్సెల్‌

రియర్‌ కెమెరా:13+2 మెగా పిక్సెల్‌

ర్యామ్‌:2జీబీ

స్టోరేజ్‌:16జీబీ

బ్యాటరీ:5000mAh

ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 10


VIDEOS

logo