శుక్రవారం 05 మార్చి 2021
Science-technology - Feb 08, 2021 , 16:01:08

15న భారత్‌లో శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌ 62 లాంఛ్‌

15న భారత్‌లో శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌ 62 లాంఛ్‌

న్యూఢిల్లీ : శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌ 62 భారత్‌లో ఈనెల 15న లాంఛ్‌ కానుందని ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది. గెలాక్సీ ఎఫ్‌ 62 ముందు, వెనుక భాగాలను ఫ్లిప్‌కార్ట్‌ రివీల్‌ చేసింది. ఇక ఈ ఫోన్‌ ధర రూ. 20,000 నుంచి  25,000 మధ్య అందుబాటులో ఉంటుందని శాంసంగ్‌ పేర్కొంది. గత ఏడాది అక్టోబర్‌లో గెలాక్సీ ఎఫ్‌ 41ను లాంఛ్ చేసిన అనంతరం శాంసంగ్‌ ఎఫ్‌ సిరీస్‌లో రెండవ ఫోన్‌ లాంఛ్‌ అవుతోంది. ఇక శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌ 62 ఫీచర్స్‌ విషయానికి వస్తే ఈ ఫోన్‌ 7ఎన్‌ఎం ఆక్టా-కోర్‌ ఇనాస్‌ 9825 ఎస్‌ఓసీపై పనిచేయనుంది.

ఈ ధరల శ్రేణిలో ఫాస్టెస్ట్‌ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ ఇదేనని శాంసంగ్‌ చెబుతోంది. క్వాడ్‌ రియర్‌ కెమెరా సెటప్‌తో పాటు ముందువైపు సెల్ఫీ కెమెరా కోసం హోల్‌-పంచ్‌ కటౌట్‌ను అమర్చారు. ఎఫ్‌ 62.. 6.7 ఇంచ్‌ సూపర్‌ అమోల్డ్‌డిస్‌ప్లేతో పాటు 7000 ఏంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం కలిగిఉంటుంది. ఎఫ్‌ 62 గ్రీన్‌, బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో లభించనుంది. 

VIDEOS

logo