మన దేశంలో సామ్సంగ్ ఫోన్లకు ఎంత డిమాండ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఏ సిరీస్, ఎమ్ సిరీస్‌లలో ఎక్కువ సేల్స్ చేసి రికార్డు క్రియేట్ చేసిన సామ్సంగ్.. తాజాగా గెలాక్సీ ఎఫ్62 ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది.
గెలాక్సీ ఎఫ్62.. గత ఫిబ్రవరిలోనే రిలీజ్ అయింది. అప్పుడు దాని ధర రూ. 23,999. తాజాగా ఆ ఫోన్‌పై 6 వేల రూపాయల డిస్కౌంట్‌ను అందిస్తోంది. గెలాక్సీ ఎఫ్62లో రెండు వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి 6జీబీ ర్యామ్, రెండోడి 8జీబీ ర్యామ్. 6జీబీ ర్యామ్ వేరియంట్ ఫోన్‌ను తాజాగా ఫ్లిప్‌కార్టులో రూ.17,999 రూపాయలకే అందిస్తున్నారు. 8జీబీ ర్యామ్ వేరియంట్ ఫోన్‌ను రూ.19,999కే అందిస్తున్నారు. గత ఫిబ్రవరిలో 8జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ.25,999 గా ఉండేది.
6 జీబీ వేరియంట్ ధర రూ.23,999గా ఉండేది. తాజాగా ఈ రెండు వేరియంట్ల ఫోన్లపై 6,000 రూపాయల భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అయితే.. ఈ ఆఫర్ ఆగస్టు 15 వరకే ఉండనుందని కంపెనీ వెల్లడించింది.
ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఉన్నవాళ్లు.. సామ్సంగ్ ఇండియా వెబ్ సైట్లో బుక్ చేస్తే మరో 2500 రూపాయల వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. ఫ్లిప్ కార్ట్ ద్వారా బుక్ చేస్తే వెయ్యి రూపాయల వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
సామ్ సంగ్ గెలాక్సీ ఎఫ్ 62 స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. వన్ యూఐ 3.1 బేస్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో పాటు 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 8జీబీ ర్యామ్, 128 జీబీ మెమోరీ, ఆక్టా కోర్ ఎక్సినోస్ 9825 ఎస్ఓసీ, 64 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, వెనుక, ముందు కెమెరాలు రెండూ 4కే వీడియోను రికార్డు చేసే కెపాసిటినీ కలిగి ఉంటాయి.