బుధవారం 28 అక్టోబర్ 2020
Science-technology - Sep 24, 2020 , 17:22:08

గెలాక్సీ F41 వచ్చేస్తోంది !

గెలాక్సీ F41  వచ్చేస్తోంది !

ముంబై దక్షిణ కొరియా టెక్‌ దిగ్గజం శాంసంగ్‌ అక్టోబర్‌ 8న భారత్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనుంది. ఎఫ్‌ సిరీస్‌లో గెలాక్సీ F41 ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది.   ఇటీవల ప్రకటించిన ఎఫ్‌ సిరీస్‌లో  విడుదలకాబోతున్న మొట్టమొదటి  స్మార్ట్‌ఫోన్‌  ఇదే.  గెలాక్సీ ఎఫ్‌ 41 స్మార్ట్‌ఫోన్‌ 6,000mAh భారీ బ్యాటరీ, సూపర్‌ అమోలెడ్‌ ఇన్ఫినిటీ-యూ డిస్‌ప్లే, ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌, వెనుకవైపు  ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

టీల్‌ ఐష్‌ కలర్‌లో ఫోన్‌ అందుబాటులో ఉండనుంది.   అక్టోబర్‌ 8న సాయంత్రం 5.30గంటలకు గెలాక్సీ  F41ఫోన్‌ను శాంసంగ్‌ భారత్‌ విడుదల చేస్తుందని ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ టీజర్‌ పేజీ ద్వారా వెల్లడించింది. ఫోన్‌ ధర రూ.15,000 నుంచి 20,000 మధ్య ఉండనుంది. 


logo