మంగళవారం 14 జూలై 2020
Science-technology - Jun 28, 2020 , 17:20:13

‘తామర’ గుట్టు వీడుతోంది..!

‘తామర’ గుట్టు వీడుతోంది..!

వాషింగ్టన్‌ డీసీ: ఎగ్జిమా.. దీన్నే తెలుగులో తామర అంటారు. ఇది ఒక దీర్ఘకాలిక చర్మసమస్య. అయితే, ఇది ఎలా వస్తుందో శాస్త్రవేత్తలకు ఇప్పటికీ అంతుపట్టడం లేదు. అందుకే దీనికి శాశ్వత చికిత్స లేదు. తామర వచ్చినప్పుడు వైద్యులు ఏవో కొన్ని క్రీములు ఇస్తుంటారు. అవి రాయగానే తామర పోతుంది. మళ్లీ కొద్దిరోజులకు ప్రత్యక్షమవుతుంది. అయితే, కొందరు శాస్త్రవేత్తలు తామర రావడానికి గల కారణాలను కనుగొన్నారు.  

థామస్ జే వాట్సన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్, అప్లైడ్ సైన్స్ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ బయోమెడికల్ ఇంజినీరింగ్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ గై జర్మన్,  పీహెచ్‌డీ విద్యార్థి జాచారి డబ్ల్యూ. లిప్స్కీ, హార్పూర్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అసోసియేట్ ప్రొఫెసర్ క్లాడియా ఎన్హెచ్ మార్క్స్, సైన్సెస్ బయోలాజికల్ సైన్సెస్ విభాగం వారు ఎగ్జిమాపై అధ్యయనం చేసి, ఓ ముందడుగు వేశారు. మన శరీరంలోని లిపిడ్లు అని పిలువబడే చర్మ నూనెలు తగ్గడం, సిరామైడ్లు అని పిలువబడే ఒక సమూహం ఇందుకు ప్రధాన కారణమని తేల్చారు. ఈ లిపిడ్లు చర్మం ఉపరితలంపై ఉంటాయి. ఇవి హైడ్రేషన్‌ను నియంత్రిస్తాయి. అలాగే, బ్యాక్టీరియా, వైరస్‌లు చర్మంపై దాడి చేయకుండా కాపాడుతాయి. స్వాభావిక యాంటీమైక్రోబియ‌ల్‌ చర్య ద్వారా చర్మాన్ని రక్షిస్తాయి.    

 కాగా, జన్యులోపం వల్లగానీ, వివిధ చేతి వృత్తుల (లోహపుపని, క్షౌరశాలలు, ఆహార ప్రాసెసింగ్‌ కార్మికులు)వల్లగానీ చర్మంపై లిపిడ్లు తగ్గిపోతాయి. దీంతో  చర్మంలో స్టాఫ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది చికాకు, బ్యాక్టీరియా సంక్రమణకు దారితీస్తుంది. దీనినే దీర్ఘకాలిక చర్మ సమస్య అయిన ఎగ్జిమాగా పిలుస్తారు.  సాధారణ, ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో బ్యాక్టీరియా చర్మంలోకి చొచ్చుకుపోదు. లిపిడ్స్‌ తగ్గితేనే ఇదిసాధ్యం. అందుకే వివిధ రకాల చేతివృత్తుల వారు ఎప్పటికప్పుడు చేతులను సబ్బుతో కడుక్కోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ అధ్యయనం ఎగ్జిమాకు కారణమవుతున్న అన్ని విషయాలను కనుగొనకపోయినా , బ్యాక్టీరియా కారణం కాగలదని చూపించడం ఒక పెద్ద ముందడగని అధ్యయనంలో పాల్గొన్న లిప్స్కీ పేర్కొన్నారు. ‘లిపిడ్ క్షీణించిన చర్మం ద్వారా బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుందని ఇప్పుడు మనకు తెలుసు, ఇది చర్మాన్ని యాంత్రికంగా ఎలా ప్రభావితం చేస్తుంది? ఇది చర్మాన్ని ఎలా బలహీనపరుస్తుంది?  పగుళ్లు వచ్చే అవకాశం ఉందా? వివిధ చర్మ పొరల ద్వారా బ్యాక్టీరియా ఎలా కదులుతుంది? అనే అంశాలపై ప్రస్తుతం దృష్టిసారిస్తున్నామని ఆమె తెలిపారు.  logo