మంగళవారం 04 ఆగస్టు 2020
Science-technology - Jul 09, 2020 , 21:23:55

త్వరలో ఇండియన్‌ మార్కెట్‌లోకి రెడ్‌మీ నోట్‌ 9ప్రో

త్వరలో ఇండియన్‌ మార్కెట్‌లోకి రెడ్‌మీ నోట్‌ 9ప్రో

న్యూ ఢిల్లీ: ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఆదరణ పొందిన రెడ్‌మి నోట్ 9ప్రో ఎట్టకేలకు ఇండియాలో లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన టీసర్‌ను షియోమీ సంస్థ ట్విట్టర్‌లో పెట్టింది. అయితే, లాంచింగ్‌ తేదీని మాత్రం ప్రకటించలేదు. టీసర్‌లో చాంపియన్‌షిప్ బెల్ట్‌ మధ్యలో 9 అంకె కలిగి ఉన్న చిత్రాన్ని పెట్టింది. దీనికిరువైపులా ‘రెడ్‌మి’, ‘నోట్’ అని రాసి ఉంది. బెల్ట్ నాలుగు సర్కిల్‌లతో కూడిన చదరపు డిజైన్‌ను బట్టి  నోట్ 9 ప్రో సిరీస్‌లో క్వాడ్ కెమెరా సెటప్ ఉన్నట్లు తెలుస్తున్నది.   

ప్రపంచవ్యాప్తంగా విడుదలైన రెడ్‌మీ నోట్‌ 9 ప్రో పూర్తి హెచ్‌డీ + (1,080x2,340 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో 6.53-అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే కలిగి ఉంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ కలిగి, ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ 85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. సెల్ఫీ కెమెరా కోసం క్వాడ్ రేర్‌ కెమెరా సెటప్ ఉంది. 18వాట్స్‌  ఫాస్ట్ ఛార్జింగ్ కలిగిన 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ, వెనుక భాగంలో అమర్చిన ఫింగర్ ప్రింట్ స్కానర్‌ దీని ఇతర ముఖ్యమైన లక్షణాలు. 3 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌కు హ్యాండ్‌సెట్ ధర 199 డాలర్లు (రూ .15,000 సుమారు). 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు 249డాలర్లు (రూ. 18,500 సుమారు).  కాగా, ఇండియాలో ఈ ఫోన్‌ ధర రూ. పదివేల నుంచే ప్రారంభం కావొచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo