బుధవారం 08 జూలై 2020
Science-technology - May 27, 2020 , 17:14:17

రెడ్‌మీ నోట్‌ 9 ప్రొ మ్యాక్స్‌కు విశేష స్పందన..నిమిషాల్లోనే స్టాక్ అవుట్!

రెడ్‌మీ నోట్‌ 9 ప్రొ మ్యాక్స్‌కు విశేష స్పందన..నిమిషాల్లోనే స్టాక్ అవుట్!

న్యూఢిల్లీ:  చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ త‌యారీ సంస్థ షియోమీ.. రెడ్‌మీ సిరీస్‌లో నోట్ 9 ప్రొ, నోట్ 9 ప్రొ మ్యాక్స్ పేరిట రెండు నూత‌న స్మార్ట్‌ఫోన్లను  భార‌త్‌లో విడుద‌ల చేసిన విషయం తెలిసిందే.   మే 12వ తేదీన  నోట్‌ 9 ప్రొ మ్యాక్స్‌ ఫోన్ల ఫస్ట్‌ సేల్‌ నిర్వహించారు.   కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన రావడంతో  బుధవారం మధ్యాహ్నం కూడా రెండోసారి అమ్మకాలు  ప్రారంభించారు. 

అద్భుత ఫీచర్లతో తీసుకొచ్చిన ఫోన్‌కు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభించింది.  బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్‌ కోసం ఫ్లాష్ సేల్ నిర్వహించగా  నిమిషాల్లోనే స్టాక్ మొత్తం అయిపోయిందని షియోమీ ఇండియా చీఫ్‌ మను కుమార్‌ జైన్‌ తెలిపారు. వచ్చే వారం అమెజాన్‌ ఇండియా, ఎంఐ డాట్‌కామ్‌ ద్వారా ఫోన్లు విక్రయిస్తామని ఆయన ట్వీట్‌ చేశారు.  

 6GB/64GB వేరియంట్‌ ధర రూ. 16,499 

 6GB/128GB వేరియంట్‌ ధర రూ. 17,999 

 8GB RAM, 128GB స్టోరేజ్‌ ధర రూ. 19,999 


logo