సోమవారం 28 సెప్టెంబర్ 2020
Science-technology - Aug 11, 2020 , 18:20:48

రెడ్ మీ నోట్ 8 ప్రో స్మార్ట్ ఫోన్ స్పెషల్ ఎడిషన్ ఫీచర్స్

రెడ్ మీ నోట్ 8 ప్రో స్మార్ట్ ఫోన్ స్పెషల్ ఎడిషన్  ఫీచర్స్

బెంగళూరు: రెడ్ మీ నోట్ 8 ప్రో స్మార్ట్ ఫోన్ లో స్పెషల్ ఎడిషన్ ఇటీవల లాంచ్ అయింది. ఇందులో కోరల్ ఆరెంజ్ కలర్ వేరియంట్ ను షియోమీ లాంచ్ చేసింది. గతేడాది అక్టోబర్ లో రెడ్ మీ నోట్ 8 ప్రో మొదట లాంచ్ కావడం విశేషం. ఇప్పుడు రెడ్ మీ నోట్ 8 ప్రో మొత్తంగా 5 రంగుల్లో అందుబాటులో ఉన్నది. ఇందులో ఎలక్ట్రిక్ బ్లూ వేరియంట్ గతేడాది చివర్లో లాంచ్ అయింది. కోరల్ ఆరెంజ్ వేరియంట్ ట్విలైట్ ఆరెంజ్ పేరిట జనవరిలోనే లాంచ్ అయింది. రెడ్ మీ నోట్ 8 ప్రో కోరల్ ఆరెంజ్ ధర ఈ ఫోన్ కు షియోమీ ప్రత్యేక ధరను నిర్ణయించలేదు. మనదేశంలో రెడ్ మీ నోట్ 8 ప్రో 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా ఉండగా, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999గా ఉంది.

రెడ్ మీ నోట్ 8 ప్రో స్పెసిఫికేషన్లు రెడ్ మీ నోట్ 8 ప్రోలో 6.53 అంగుళాల స్క్రీన్ ను అందించారు. ఇందులో మీడియాటెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్ ను ఉపయోగించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4,500 ఎంఏహెచ్ గా ఉంది. ఇందులో 64 మెగా పిక్సెల్+ 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న కెమెరాలను వెనకవైపు అందించారు. ఇందులో ఫ్రంట్ కెమెరా సామర్థ్యం 20 మెగా పిక్సెల్ గా ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ విషయానికి వస్తే.. వైఫై, జీపీఎస్, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్ సీ, యూఎస్ బీ టైప్-సీ, 3జీ, 4జీ సపోర్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, కంపాస్/మాగ్నెటో మీటర్, గైరో స్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ లను కూడా ఇందులో అందించారు. దీని బరువు 199.8 గ్రాములు.16.13 సెంటీ మీటర్ల పొడవు, 7.64 సెంటీ మీటర్ల వెడల్పు, 0.88 సెంటీమీటర్ల 


logo