గురువారం 22 అక్టోబర్ 2020
Science-technology - Aug 04, 2020 , 14:09:26

బడ్జెట్‌ ఫోన్‌..రెడ్‌మీ 9 ప్రైమ్‌ వచ్చేసింది

బడ్జెట్‌ ఫోన్‌..రెడ్‌మీ 9 ప్రైమ్‌ వచ్చేసింది

ముంబై:  చైనా మొబైల్‌ మేకర్‌  షియోమీ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మీ 9 ప్రైమ్‌ను భారత్‌లో ఇవాళ ఆవిష్కరించింది.  ఈ ఫోన్‌ వాటర్‌ డ్రాప్‌ స్టైల్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ కొత్త బడ్జెట్‌ ఫోన్‌ నాలుగు రియర్‌ కెమెరాలతో  వస్తున్నది. ఇందులో ఆల్ట్రా వైడ్‌ యాంగిల్‌ షూటర్‌ ఉంటుంది.  రియర్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ వంటి ఫీచర్లు  ఉన్నాయి. నూతన మోడల్‌ నాలుగు విభిన్న రంగుల్లో లభిస్తుంది.  

4 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 11,999 కాగా 4 జీబీ ర్యామ్+ 64 జీబీ స్టోరేజ్ మోడల్‌ ధర రూ.  9,999గా నిర్ణయించారు.  ఆగస్టు 6 నుంచి ఆరంభమయ్యే అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌లో  రెడ్‌మీ 9 ప్రైమ్‌ విక్రయాలు ప్రారంభంకానున్నాయి. కంపెనీ వెబ్‌సైట్‌ mi.com ద్వారా ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. 


logo