సోమవారం 13 జూలై 2020
Science-technology - May 15, 2020 , 12:42:53

భారత మార్కెట్లోకి రియల్‌మీ స్మార్ట్‌టీవీ

 భారత మార్కెట్లోకి రియల్‌మీ స్మార్ట్‌టీవీ

ముంబై: చైనాకు చెందిన మొబైల్‌ఫోన్ల తయారీ కంపెనీ రియల్‌మీ భారత్‌లో స్మార్ట్‌టీవీలను విడుదల చేసేందుకు సిద్ధమైంది. మే 25న రియల్‌మీ టీవీలను లాంచ్‌ చేయనున్నట్లు తాజాగా తెలిపింది. రియల్‌మీ స్మార్ట్‌ టీవీలు ఏప్రిల్‌ నెలలో విడుదల కానున్నట్లు రియల్‌మీ ఇండియా సీఈవో మాధవ్‌ సేథ్‌ గత ఫిబ్రవరిలోనే వెల్లడించారు. ఐతే కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో కొత్త ఉత్పత్తుల విడుదల ఆలస్యమైంది. 

వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌, ఫిట్‌నెస్‌ బ్యాండ్‌లను ఇప్పటికే భారత్‌లో రిలీజ్‌ చేసింది.   ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ ద్వారా మే 25న మధ్యాహ్నం  రియల్‌మీ తన ఫస్ట్‌ స్మార్ట్‌వాచ్‌తో పాటు స్మార్ట్‌టీవీని లాంచ్‌ చేయనుంది..  టీవీ రిలీజ్‌కు సంబంధించి వీడియో టీజర్‌ను సీఈవో మాధవ్‌   రియల్‌మీ ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. 


logo