మంగళవారం 07 జూలై 2020
Science-technology - Jun 02, 2020 , 13:35:03

12,999కే రియల్‌మి స్మార్ట్‌ టీవీ..ఫస్ట్‌సేల్‌ ప్రారంభం

 12,999కే రియల్‌మి స్మార్ట్‌ టీవీ..ఫస్ట్‌సేల్‌ ప్రారంభం

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి..స్మార్ట్‌ టీవీల సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మీడియా టెక్‌ చిప్‌సెట్‌, డాల్బీ ఆడియో క్వాడ్‌ స్పీకర్లు వంటి అధునాతన ఫీచర్లతో రూపొందించిన రెండు టీవీలను భారత మార్కెట్లో ఇటీవల ఆవిష్కరించింది. 32 అంగుళాల డిస్‌ప్లే(1366×768 రిజల్యూషన్‌) టీవీ ధర రూ.12,999 కాగా, 43 అంగుళాల డిస్‌ప్లే(1920×1080)  టీవీ ధర రూ.21,999గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. రెండు టీవీల్లోనూ కేవలం స్క్రీన్‌ రిజల్యూషన్‌ మాత్రమే తేడా ఉంటుంది. 

ఆండ్రాయిడ్ 9.0 ఆధారంగా ఈ టీవీలు ప‌నిచేస్తాయి. స్మార్ట్‌టీవీల ఫస్ట్‌సేల్‌ మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైంది.   ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మి డాట్‌కామ్‌ ద్వారా స్మార్ట్‌ టీవీలను వినియోగదారులు కొనుగోలు చేయొచ్చు. త్వరలోనే రిటైల్‌ స్టోర్లలోనూ టీవీలను కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచనున్నారు. 


logo