ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్మీ అంతర్జాతీయ మార్కెట్లోకి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. రియల్మీ తన నార్జో 30 స్మార్ట్‌ఫోన్‌లో 5జీ వెర్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది. ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్న రియల్మీ 8 5జీ ఫోన్, కొత్త వేరియంట్ మోడల్ స్పెసిఫికేషన్లు దాదాపు ఒకేలా ఉంటాయి. రియల్మీ 8 5జీ ఇప్పటికే భారత్‌లో లభిస్తున్నందున నూతన ఫోన్ గ్లోబల్ వెర్షన్‌కు భిన్నంగా ఉంటుందని భావిస్తున్నారు. నార్జో 30 5జీ మోడల్ ధర సుమారు రూ.19,500గా ఉంది. ఈ ఫోన్ రేసింగ్ బ్లూ, రేసింగ్ బ్లాక్ కలర్లలో లభించనుంది. నార్జో 30 5జీ మోడల్ త్వరలో భారత్‌లో విడుదలకానుందని సీఈవో మాధవ్ సేథ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
నార్జో 30 5జీ స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే:6.50 అంగుళాలు
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 700
ఫ్రంట్ కెమెరా: 16 మెగా పిక్సల్
రియర్ కెమెరా: 48+2+2 మెగా పిక్సల్
ర్యామ్:4GB
స్టోరేజ్:128GB
బ్యాటరీ కెపాసిటీ:5000mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 11